మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 23, 2020 , 01:17:41

పోటెత్తిన ఓటర్లు

 పోటెత్తిన ఓటర్లు
  • - జిల్లాలో 81.90 శాతం పోలింగ్
  • - ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
  • - ఓటేసిన 63,750 మంది ఓటర్లు
  • - ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
  • - పోలింగ్ కేంద్రాలను సందర్శించిన...ఎన్నికల అబ్జర్వర్ హరిచందన, కలెక్టర్ వెంకట్రామ్
  • - గజ్వేల్-ప్రజ్ఞాపూర్ 80.49 శాతం, దుబ్బాకలో 82.57, హుస్నాబాద్ 84.16 చేర్యాల 81.53 శాతం పోలింగ్ నమోదు
  • - ఈ నెల 25న ఓట్ల లెక్కింపు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లోని 69 వార్డు లకు ఎన్నికలను నిర్వహించారు. పురుషులు 31,405, మహిళలు 32,345, మొత్తం 63,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  జిల్లాలో సరాసరిగా 81.90 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా హుస్నా బాద్ మున్సిపల్ 84.16 శాతం, అత్యల్పంగా గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 80.49 శాతం పోలింగ్ నమో దైంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిత వ్యం బ్యాలెట్ బాక్స్  భద్రమైంది.  ఈ నెల 25న ఓట్లను లెక్కించనున్నారు.  ఉదయం నుంచే  ఆయా పోలింగ్ కేంద్రా ల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి వసతితోపాటు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కలెక్టరేట్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను అధికా రులు పరిశీలించారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ హరి చందన.. అన్ని మున్సిపాలిటీల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అలాగే, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంక ట్రామ్ గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లోని పలు వార్డు ల్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. వీరితోపాటు పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్ని మున్సిపాలిటీల్లో, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ చేర్యాల మున్సిపాలిటీ, డీఆర్ చంద్రశేఖర్ హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో పోలింగ్ సరళిని పరిశీ లించారు. చేర్యాలలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ తమ ఓటు హక్కు  విని యోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉదయం నుంచే ఆయా వార్డుల్లో ఓటర్లు బారులు తీరారు.  పోలింగ్ శాతం పెరగడంతో అభ్యర్థులు హుషారుగా ఉన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ పార్టీ క్లీన్ చేయనుంది. 

* జిల్లాలో 81.90 శాతం పోలింగ్

మున్సిపల్  ఎన్నికల్లో జిల్లాలో 81.90 శాతం పోలింగ్ నమోదైంది. గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ 20 వార్డుల్లో 80.49 శాతం నమోదు కాగా, దుబ్బాక మున్సిపాలిటీలోని 19 వార్డు ల్లో 82.57 శాతం, హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో 84.16 శాతం, చేర్యాల మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో  81.53 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ్ తెలిపారు. జిల్లాలో  పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్  స్ట్రాంగ్ రూంలకు తరలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను పోలీసు అధికారులు చేస్తు న్నారు. కాగా, గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుస్నాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్, దుబ్బాక తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట, చేర్యాల టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్ ఓట్ల లెక్కింపు జరగనుంది.


ప్రశాంతంగా ఎన్నికలు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతం గా జరిగేలా బందోబస్తు చేసిన పోలీసు అధికారులకు, పోలింగ్ సిబ్బందికి సీపీ జోయల్ డెవిస్ అభినందనలు తెలిపారు. ఎన్నికలకు సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్ తరలించి అక్కడ ఆర్మ్ రిజర్వ్ పోలీసులతో సంబంధిత ఏసీపీలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 
-  పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్

logo