శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 23, 2020 , 01:16:58

ఎన్నికలపై పర్యవేక్షణ

ఎన్నికలపై పర్యవేక్షణ


దుబ్బాక టౌన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. చేర్వాపూర్ 6వ వార్డులోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, పోలింగ్ సరళిని  తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలోని 33వ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే, మున్సిపల్ ఎన్నికల జిల్లా అబ్జర్వర్ దాసరి హరిచందన.. దుబ్బాక బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య ఓటింగ్ తీరును ఎప్పటికప్పుడు  పరిశీలించారు.
-  భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సీపీ

గజ్వేల్ రూరల్ : భారీ భద్రతా ఏర్పాట్లుతో ప్రణాళికాబద్ధం గా నిర్వహించడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉద యం 7:00 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చారు. ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 9 గంటలకు  జిల్లా ఎన్నికల పరిశీలకురాలు హరిచందన, కలెక్టర్ వెంకట్రామ్ ప్రజ్ఞాపూర్ 16వ వార్డు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధానాన్ని పరిశీలించారు. అలాగే, సాయంత్రం పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, దివ్యాంగ ఓటర్లు తమ వైకల్యాన్ని లెక్కచేయకుండా సహాయకులతో కలిసి ఓటేశారు. గజ్వేల్ 13, 8 వార్డు పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, ఏజెంట్ల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.

హుస్నాబాద్ జిల్లా అబ్జర్వర్ హరిచందన

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : పట్టణంలో పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ హరిచందన పర్యవేక్షించారు. మొదట 16, 5 వార్డుల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. సరస్వతీ శిశుమందిర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తనిఖీ చేశారు. అనంతరం మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన స్ర్తాంగ్ కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. హుస్నాబాద్ జరుగుతున్న పోలింగ్ సరళి, ఏర్పాట్ల, భద్రతా ఏర్పాట్లపై అబ్జర్వర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే సీపీ జోయల్ డెవిస్, డీఆర్ చంద్రశేఖర్.. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ మహేందర్, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, మేనేజర్ రామకృష్ణ, జోనల్ అధికారులు ఉన్నారు.
           

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన హరిచందన

చేర్యాల, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీలోని పెద్దమ్మగడ్డలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలికురాలు హరిచందన, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ట్రైనీ ఐపీఎస్ అఖిల్ సందర్శించారు. కాగా, అసిస్టెంట్ ఎన్నికల అధికారి పాల్వాయి శ్రవణ్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించారు. logo