బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 22, 2020 , 00:52:00

రూ.304 కోట్లు

 రూ.304 కోట్లు
  • - జిల్లాకు రైతుబంధు నిధులు మంజూరు
  • - త్వరలో రైతుల ఖాతాల్లో నగదు జమ
  • - 22 మండలాలు..2,59,807 మంది రైతులు
  • - ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం
  • - సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం
  • - సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • - వరుసగా నాల్గవ పంటకు పెట్టుబడి సాయం


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్.. వరుసగా నాలుగవ పంటకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. యాసంగి పెట్టుబడి సాయాన్ని విడుదల చేశారు. త్వరలోనే నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ కానున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. గత వానకాలం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందిస్తుంది. తాజాగా యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని విడుదల చేయడంతో జిల్లాకు సుమారు రూ.304 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం నిధులు విడుదల చేయడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. 

 రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ ప్రభు త్వం.. యాసంగి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయడంతో  రైతాంగం సంబురపడుతుంది. జిల్లాలోని 22 మండలాల్లో సుమారుగా 2,59,807 మంది రైతులు ఉన్నారు. వీరందరికీ యాసంగి పెట్టుబడి సాయాన్ని అందించడానికి జిల్లాకు రూ. 304 కోట్లు అవసరమవుతాయి. ఇందుకు సంబంధించిన ని ధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేయడంతో ఆయా రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎకరాకు రూ.4వేల చొప్పు న రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలను అందించారు.

 గత వానకాలం నుంచి పంట పెట్టుబడి సాయాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచడంతో ఎకరాకు రూ.5 వేల చొ ప్పున రెండు పంటలకు రూ.10 వేలను అందిస్తున్నారు. రైతుబంధు పథకం ప్రారంభమైన నుంచి నేటి వరకు వరుసగా నాలుగు పంటలకు పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకున్నది టీఆర్ ప్రభుత్వం. ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసం వేస్తున్న సర్కారును రైతులంతా దీవిస్తున్నారు. పంట పెట్టుబడి సాయం అందించడంతో పాటు పం డించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రుణమాపీ కూడా చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. రైతుబంధు పథకంతో పాటు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకవచ్చింది. ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తుంది. ఇప్పటికే జిల్లాలో చాలా మంది రైతుల కుటుంబాలకు రైతుబీమా వర్తింపజేసి ఆదుకుంది. 

నేరుగా రైతుల ఖాతాల్లోకే..

రైతుబంధు పథకం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. జిల్లాకు సుమారుగా రూ.304 కోట్లు రానున్నాయి. ఎకరాకు రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. సుమారుగా రెండు లక్షల యాభై తొమ్మిది వేల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందనుంది.
- శ్రావణ్ (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి)

సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు..

రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్.. రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. యాసంగి పెట్టుబడి సాయం అందించేందుకు నిధులు విడుదల చేయ డంపై జిల్లా రైతాంగం తరపున సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు. వరుసగా నాలుగవ పంటకు పంట పెట్టుబడి సా యాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే వేస్తుంది. రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తుంది. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించి రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే, రైతుబీమా తో రైతు కుటుంబాల్లో భరోసా నింపింది.
-  వంగ నాగిరెడ్డి (రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు)


logo