గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 22, 2020 , 00:51:03

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పురఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల  మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 72 వార్డులకు గాను మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 69 వార్డుల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 69 వార్డుల్లో మొత్తం 327 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 77,825 మంది ఓటర్లకు గాను పురుషులు 38,424 మంది, మహిళలు 39,400 మంది, థర్డ్ జండర్ 01 ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 559 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 29 పోలింగ్ కేంద్రాల్లో  వెబ్ చేపడుతారు. పోలింగ్ బూత్ వారిగా ఓటరు స్లిప్ పంపిణీ చేశారు. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని వెళ్లాలి.

జిల్లాలో జరుగనున్న నాలుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో 29 పోలింగ్ కేంద్రాల్లో విద్యార్థులచే వెబ్ చేపడుతారు. ఇంజనీరింగ్ విద్యార్థులచే ఈ విధానం చేపట్టడానికి అన్ని రకాల చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కంట్రోల్ అనుసంధానం చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ 12, హుస్నాబాద్ 10, చేర్యాలలో 07 కేంద్రాలున్నాయి. ఇందుకోసం 19 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.  దీని ద్వారా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును ఎప్పటికప్పుడు కలెక్టర్ వెంకట్రామ్   పరిశీలించనున్నారు. కాగా ఎన్నికల నిర్వాహణ కోసం 559 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 39 మంది ముఖ్య ఎన్నికల అధికారులు, 87 మంది సహాయ ఎన్నికల అధికారులు, 186 మంది పీవోలు, 186 మంది ఏపీవోలను నియామకం చేశారు. వీరంతా ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు.

77,825 మంది ఓటర్లు

నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 77,825 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 38,424 మంది, మహిళలు 39,400 మంది, థర్డ్ జండర్ 01 ఉన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పురుషులు 15,434 మంది మహిళలు 15,443 మంది, దుబ్బాక మున్సిపాలిటీలో పురుషులు 9,219 మంది మహిళలు 9,750 మంది, హుస్నాబాద్ మున్సిపాలిటీలో పురుషులు 7,650 మంది, మహిళలు 7,910 మంది, థర్డ్ జండర్ 01, చేర్యాల మున్సిపాలిటీలో పురుషులు 6,121 మంది, మహిళలు 6,297 మంది ఓటర్లున్నారు.  నాలుగు మున్సిపాలిటీలలో మొత్తం 72 వార్డులకు గాను హుస్నాబాద్ రెండు వార్డులు, దుబ్బాకలో ఒక వార్డు ఏకగ్రీవమైంది. దీంతో 69 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 155 పోలింగ్ కేంద్రాలకు గాను 3 వార్డులలో ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో 149 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

69 వార్డుల్లో 327 మంది అభ్యర్థులు...

నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 327 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 72 వార్డులకు గాను 3వార్డులు ఏకగ్రీవం కావడంతో 69 వార్డులకు నేడు ఎన్నికలను జరుగుతున్నాయి. గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ 20 వార్డులకు గాను 78 మంది బరిలో నిలిచారు. టీఆర్ -20 మంది, కాంగ్రెస్ -19మంది, బీజేపీ 09, స్వతంత్రులు 30 మంది ఉన్నారు. దుబ్బాకలో 20 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా 19 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 109 మంది బరిలో నిలిచారు. టీఆర్ -19 మంది, కాంగ్రెస్-15, బీజేపీ-17, టీడీపీ-05, సీపీఎం-02, సీపీఐ-01, స్వతంత్రులు 50 మంది బరిలో నిలిచారు. హుస్నాబాద్ 20 వార్డులకు గాను 02 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు నిర్వహించేవి 18 వార్డులు. 73 మంది ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ -18 మంది, కాంగ్రెస్-16, బీజేపీ-17, టీడీపీ-02, సీపీఐ-03, స్వతంత్రులు -17మంది బరిలో ఉన్నారు. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 67మంది బరిలో నిలవగా టీఆర్ కాంగ్రెస్-12, బీజేపీ-12, సీపీఎం-07, సీపీఐ-02, స్వతంత్రులు 22 చోట్ల బరిలో నిలిచారు.

పటిష్ట బందోబస్తు..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మకమైనవి 05, సమస్యాత్మకమైనవి 17, సాధారణ పోలింగ్ కేంద్రాలు 127 గుర్తించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అడిషినల్ డీసీపీలు 02, ఏసీపీలు 04, సీఐలు 15, ఎస్ 32, ఏఎస్ హెడ్ కానిస్టేబుళ్లు 75, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు 326, హోంగార్డులు, మహిళా హోంగార్డులు 60, రిజర్వ్ అధికారుల సిబ్బంది 57, మొబైల్ పార్టీలు 16, ైస్ట్రెకింగ్ ఫోర్స్ 04, స్పెషల్ ైస్ట్రెకింగ్ ఫోర్స్ 08 మొత్తం 571 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు 25 మందిని నాన్ వారెంట్స్ ఎగ్జిక్యూటివ్ చేశారు. ఎన్నికల కేంద్రాల వద్ద, చుట్టు పక్కల 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ గుంపుగుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించవద్దని సీపీ సూచించారు.

20 ఏండ్ల తర్వాత పురపోరులో ‘బ్యాలెట్’..

గజ్వేల్ టౌన్: దాదాపు 20 ఏండ్ల తర్వాత పురపాలక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శాసనసభ, లోక్ ఎన్నికలలో ఈవీఎం యంత్రాలతో ఓటుహక్కును వినియోగించుకున్న పట్టణ ఓటర్లు ఈసారి పురపాలక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటును వేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామాల్లోని ఓటర్లు బ్యాలెట్ ద్వారానే ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్టణంలో పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు లేనందున వారికి అవకాశం రాలేదు. 2005, 2014 సంవత్సరాల్లో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలనే వినియోగించారు. వాటికన్నా ముందు 2000 సంవత్సరంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ పెట్టెలను వాడారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పట్టణ ఓటర్లు బ్యాలెట్ పత్రాలతో తమ ఓటుహక్కును నేడు వినియోగించుకోనున్నారు.logo