మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 22, 2020 , 00:49:39

పురపోరుకు భారీ బందోస్తు

పురపోరుకు భారీ బందోస్తు


హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో బుధవారం జరుగనున్న పోలింగ్ 800మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. మంగళవారం హు స్నాబాద్ మోడల్ స్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 69 వార్డుల్లో 149 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ ప్రశాంతగా జరిగేలా 800 మందితో భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 2 అడిషనల్ డీసీపీలు, 4 ఏసీపీలు, 15 మంది సీఐలు, 32 మంది ఎస్ ఏఎస్ హెడ్ 75 మంది, కానిస్టేబుళ్లు 326 మంది, హోంగార్డులు 60, ఆర్మ్ రిజర్వ్ సిబ్బంది 57, మొబైల్ పార్టీలు 16, ైస్ట్రెకింగ్ ఫోర్స్ 4, స్సెషల్ ైస్ట్రెకింగ్ ఫోర్స్ 8 మంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, వీటిలో 5 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా ఉన్నాయని చెప్పారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టడం లేదా భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తెలిస్తే వెంటనే 7901100100 నంబరు లేదా 100కు  ఫోన్ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీ జోయల్ సూచించారు. సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఈవో రవికాంతరావు, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్ సుధాకర్ పాల్గొన్నారు. 


logo