సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 21, 2020 , 00:26:41

సమాప్తం

సమాప్తం


మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ వారం రోజుల పాటు పాదయాత్రలు, రోడ్‌షోలు, ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి తమకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జిల్లాలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున గజ్వేల్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక, గజ్వేల్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. రేపు(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది.

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం వారం రోజుల పాటు జోరుగా కొనసాగింది. 72 వార్డులకు గానూ 3 వార్డుల ను టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 69 వార్డులకు రేపు పోలింగ్‌ జరుగనున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హ రీశ్‌రావు పాల్గొని కొత్త ఊపును తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను వివరించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు., గజ్వేల్‌, దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సోలిపే ట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌ వారివారి నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం నిర్వహిం చారు. శాసన మండలి చీఫ్‌ విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు చేర్యాలలో, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్‌లో ప్రచారం చేశా రు. జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ తదితర నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం చేశారు.

గడపగడపకూ గులాబీ సైన్యం

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గులాబీ సైన్యం గడపగడపకూ తీసుకెళ్లి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరింది. ఆయా నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు వార్డుల వారీగా ఇన్‌చార్జిలుగా వ్యవహరించి ప్రతి ఓటరును కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మి షన్‌ భగీరథ ద్వారా తాగునీరు, కల్యాణ లక్ష్మి, ఆసరా, చెరువుల సుంధరీకరణ తదితర పథకాలను ప్రజలకు వివరించా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం, కేసీఆర్‌ కిట్టు తదితర పథకాలు ప్రజలకు వివరించారు. కండ్ల ముందు న్న అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని కోరారు. ఎన్నికలప్పుడు వచ్చే ప్రతి పక్ష పార్టీలను నమ్మవద్దని సూచించారు. ఎన్నికల్లో ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు.
logo