బుధవారం 30 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 20, 2020 , 02:50:49

చిన్నారుల చక్కని జీవితానికి రెండు పోలియో చుక్కలు

చిన్నారుల చక్కని జీవితానికి రెండు పోలియో చుక్కలుకలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : చిన్నారుల చక్కని భవిష్యత్తు కోసం పోలియో చుక్కలు వేయించాలని జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ అన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్‌ దవాఖాన వద్ద ఆదివారం డీఎంహెచ్‌వో మనోహర్‌తో కలిసి జేసీ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జేసీ పద్మాకర్‌ మాట్లాడుతూ 0-5 సంవత్సరాల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో మొత్తం 78887 మంది పిల్లలుండగా 77805 పిల్లలకు చుక్కలు వేశారు. కొమురవెల్లి మల్లన్న జాతరలో 2704 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.  కాగా జిల్లాలో మొత్తం 80509 పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. జిల్లాలో మొత్తం 102 శాతం పల్స్‌పోలియో కార్యక్రమం జరిగింది. హైరిస్క్‌ ఏరియాల్లో 1316 మంది పిల్లలున్నారన్నారు. జిల్లా మొత్తం 711 బూత్‌లు, 19 ట్రాన్సిట్‌ పాయింట్లలో పోలియో వేశారన్నారు. మొత్తం 77 రూట్లతో 2844 మంది సిబ్బంది పోలియో చుక్కలు వేసేందుకు శిక్షణ ఇచ్చామన్నారు. సోమ, మంగళవారాల్లోను సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమంలో వైద్యులు విజయరాణి, కాశీనాథ్‌, వినోద్‌బాబ్జీ, రామ్‌, పీటర్సన్‌, ఏసుమేరీ, నర్సింహా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


logo