సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 19, 2020 , 00:16:31

పల్లెప్రగతి పనులతో అభివృద్ధి

పల్లెప్రగతి పనులతో అభివృద్ధి


గజ్వేల్‌ రూరల్‌ : పల్లెప్రగతి కార్యక్రమంలో గజ్వేల్‌ మండలం లోని గ్రామాలను చాలా పరిశుభ్రంగా తీర్చిదిద్దుకున్నారని  సహకార శాఖ కమిషనర్‌ వీరబ్రహ్మయ్య కితాబునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మండలంలో నిర్వహించిన 10 రోజుల పల్లె ప్రగతి పనుల తీరు తెన్నులను శనివారం పరిశీలించారు. అక్కారం, బంగ్లావెంకటాపూర్‌, కోమటిబండ గ్రామాల్లోని పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను సందర్శించి, వాటి నిర్వహణ, వినియోగం, స్నానాల గదు ల నిర్మాణాలను పరిశీలించారు. అలాగే, హరితహారం నర్సరీలను సందర్శించి.. ఏఏ మొక్కలను పెంచుతున్నారు? నర్సరీల నిర్వాహణను పరిశీలించారు. డంపింగ్‌యార్డుల నిర్వహణ, తడి, పొడి చెత్తల సేకరణను సర్పంచ్‌, పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కారం గ్రామంలో వృద్ధులకు కలిసి పింఛన్లు సమయానికి అందుతున్నాయా? అని ప్రశ్నించగా సమయానికే ఇస్తున్నారని  వృద్ధుడు సమాధానం ఇవ్వడంతో సం తోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే, నూతనంగా కొ నుగోలు చేసిన ట్రాక్టర్లు, ట్యాంకర్ల వినియోగం పై వివరాలను సేకరించారు. పవర్‌వీక్‌లో చేపట్టిన పనులు, స్తంభాలు, విద్యుత్‌ మీటర్ల ఏర్పాట్లపై ఆరా తీశారు. కోమటిబండలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాను పరిశీలించారు. 30రోజుల కార్యాచరణలో చేసిన పనుల వివరాలు గ్రామస్తులతో స్వయం గా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఎంతవరకు పనులు జరిగాయన్న విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే, మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ తాను 12 జిల్లాల్లో జరిగిన పల్లెప్రగతి పనుల పరిశీలన కోసం ప్రత్యేకాధికారిగా గజ్వేల్‌ మండలంలోని 3 గ్రామాలను సందర్శించినట్లు తెలిపారు.  మండలంలో 30 రోజుల కార్యచరణతో పాటు 10 రోజుల పల్లె ప్రగతిని విజయవంతంగా పూర్తి చేయ డంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రా మాలు అభివృద్ధి పథంలో సాగుతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లేశం, ఎంపీడీవో దామోదర్‌    రెడ్డి, డీసీవో మనోజ్‌కుమార్‌, డీఎల్‌పీవో నాగరాజు, ఎంపీపీ దాసరి అమరావతి, ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో రాజు, సర్పంచ్‌లు బాల్‌చంద్రం, బాపురెడ్డి, శేఖర్‌ పటేల్‌ పాల్గొన్నారు.logo