ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 19, 2020 , 00:10:43

అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు


కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి అందజేస్తుందని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని నర్సపురం శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై డిప్యూటీ కలెక్టర్‌ మోజాంబీన్‌ఖాన్‌, జేసీ పద్మాకర్‌, డీఆర్‌వో చంద్రశేఖర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అన్ని వార్డుల్లో సర్వే నిర్వహించామని తెలిపారు. కాగా, సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సర్వే చేసేందుకు అధికారులకు 31 రకాల శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలి పారు. దరఖాస్తుదారుడి ఇంట్లో సర్వే చేపట్టిన వివరాలతోపాటు వివిధ శాఖలు ఇచ్చిన సమాచారం సరి చూసి, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, ఇందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారుడు గతంలో ప్రభుత్వ లబ్ధ్ది పొంది ఉన్నాడా? ఏవైనా స్థిర చరాస్తులు కలిగి ఉన్నా వాటికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసిం ది. వీటిని సర్వే చేసే అధికారులకు సమాచారాన్ని కలెక్టర్‌ అందజే శారు. వీరు సోమవారం నుంచి పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించి వివరాలు తెలుసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

చింతమడక పునర్నిర్మాణ..పనులను వేగవంతం చేయాలి

సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్‌ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పునర్నిర్మాణం కోసం చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని అధికారుల ను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు ఆఫీస్‌లో ఆర్డీవో అనంతరెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌తో కలిసి  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. చింతమడక పూర్వ గ్రామాలైన మాచాపూర్‌, సీతారాంపల్లితో పాటు చింతమడకలోని ఎస్సీ కాలనీని ఈ నెల 21 వరకు ఖాళీ చేయించి, వారిని తాత్కాలిక నివాసాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే, టాయిలెట్‌, విద్యుత్‌ పనులను రెండు రోజు ల్లో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, నేతలు చందర్‌రావు, బాలయ్య, చంద్రం, బుగ్గ రాజు, సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డి,  ట్రాన్స్‌కో ఎస్‌ఈ కరుణాకర్‌బాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు, తహసీల్దార్‌ పరమేశ్వర్‌, ఎంపీడీవో సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo