శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 18, 2020 , 00:11:11

కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో విజయం సాధిస్తాం

కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో విజయం సాధిస్తాం

హుస్నాబాద్‌ టౌన్‌ : సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌ స్పష్టం చేశారు. హుస్నాబాద్‌లోని 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నీరుమల్ల స్మితకు మద్దతుగా శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌పై ఈ ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాడన్నారు. హుస్నాబాద్‌ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులతో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలకు టీఆర్‌ఎస్‌కు నీరాజనం పలుకుతున్నారని, ఇప్పటికే ఇద్దరు కౌన్సిలర్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, పట్టణంలో చేపట్టిన అభివృద్ధే ఏకగ్రీవం కావడానికి నిదర్శనమన్నారు. పట్టణంలోని 18వార్డుల్లో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నీరుమల్ల లక్ష్మీనారాయణ, రాగి కవిత, నాగరాజు, దొమ్మాటి రమేశ్‌, గౌరిశెట్టి సత్యనారాయణ, మాడిశెట్టి హేమలత, మంచాల రవీందర్‌, చందా వీరన్నతోపాటు పలువురు పాల్గొన్నారు.


logo