శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 16, 2020 , 23:24:17

టీఆర్ దూకుడు

టీఆర్ దూకుడు


దుబ్బాక టౌన్/ దుబ్బాక నమస్తే తెలంగాణ : పారదర్శక పాలన టీఆర్ సాధ్యం..70 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఐదేండ్లలో చేసి చూపించాం..సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం..అందుకే రాష్ట్ర ప్రజలు టీఆర్ పాలనను కోరుకుంటున్నారని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దుబ్బాక పట్టణం గులాబీమయంగా మారింది. పట్టణంలోని 20వ వార్డు మాడబోయిన స్వప్న , 19వ వార్డు శ్రీరాం సంగీత , 16వ వార్డు ఆలేటి చంద్రమౌళి, 13వ వార్డు ఆస సులోచనకి మద్దతుగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

దుబ్బాక అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని మిషన్ భగీరథ ద్వారా తాగునీటి గోసను తీర్చామని, వచ్చే రెండుమూడు నెలల్లో కాళేశ్వరం నీళ్లతో సాగునీటి ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తామన్నారు. టీఆర్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. టీఆర్ పార్టీ తరుపున పోటీ చేసే ప్రతి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి దుబ్బాక మున్సిపాలిటీ పై గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. ఇది ఇలా ఉంటే మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గంలోని మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంట, తొగుట, నార్సింగి, రాయపోల్ మండలాలకు చెందిన టీఆర్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు గురువారం విస్తృతంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.logo