ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 16, 2020 , 23:21:37

చకచకా కూల్చివేతలు

చకచకా కూల్చివేతలు

సిద్దిపేట రూరల్ : సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక పునర్నిర్మాణంలో భాగంగా మధిర గ్రామమైన దమ్మచెరువు గ్రామస్తులు స్వచ్ఛందం గా ఇండ్లను ఖాళీ చేసేందుకు ముందుకొచ్చారు. జిల్లా యంత్రాంగం వీరికి తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గురువారం దమ్మచెరువులో పాత ఇండ్ల కూల్చివేత, తాత్కాలిక పునరావాస కేంద్రాలను కలెక్టర్ వెంకట్రామ్ పర్యవేక్షించారు. జేసీ పద్మాకర్, సుడా చైర్మన్ రవీందర్ జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ సర్పంచు హంసకేతన్ కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. నీటి వసతి, మరుగుదొడ్లు, స్నానపు గదులు, నూతన గృహాలు నిర్మాణమయ్యేంత వరకు కావాల్సిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేయనుందన్నా రు.

అంకంపేటలో 45, చింతమడక ఎస్సీ కాలనీ లో 250 ఇండ్లను ఐదు రోజుల్లో ఖాళీ చేసి వారికి తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు వీఆర్ గ్రామ కార్యదర్శులతో 15 ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేశామని, శుక్రవారం ఉదయం 8 గంటలకు శిక్షణ ఇచ్చి, వీరికి కేటాయించిన గ్రా మాల్లో ఇండ్లను పూర్తిస్థాయిలో ఖాళీ చేయించ డం, తాత్కాలిక పునరావాసం కల్పించే బాధ్యతలను అప్పగించనున్నారు. గ్రామస్తుల సందేహాలను నివృత్తి చేస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సమ్మిరెడ్డి, తహసీల్దార్ పరమేశ్వర్, ఉప సర్పంచు రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo