శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 14, 2020 , 03:44:34

అభ్యర్థులెవరో తేలేది నేడే!

అభ్యర్థులెవరో తేలేది నేడే!

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయింది. ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోతున్నారు. పార్టీ బీ-ఫారం రాని వారంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడమా..? బరిలో నిలుస్తారా..? అ నేది తేలనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవడానికి గడువు ఉండడంతో అన్ని పార్టీల్లో ఉత్కం ఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. పార్టీ బీ-ఫారం రాని వారు ఈ రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు ఉపసంహరణ చేసుకోనున్నారు.


జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులుండగా స్క్రూట్నీ అనంతరం 542 మంది 738 నామినేషన్లు సరైనవిగా ఎన్నికలు అధికారులు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పార్టీ బీ-ఫారం ఎవరికైతే వస్తుందో వారికి పార్టీ గుర్తు వస్తుంది. గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా, టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులుండగా, 80మంది, హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులుండగా, 72మంది, చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులుండగా, 52మంది నామినేషన్లు వేశారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఆయా మున్సిపాలిటీలో దాదాపుగా ఖరారు చేశారు. 


గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసి వారికి బీ-ఫారాలను సైతం అందజేశారు. అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తున్నారు. హుస్నాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసి, వారికి సంబంధించిన బీ ఫారాలను ఎన్నికల అధికారికి అందజేశారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులుండగా, దాదాపు అభ్యర్థుల ఖరారు పూర్తయింది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు అభ్యర్థుల ఖరారు పూర్తి కాగా, ఈ రెం డు మున్సిపాలిటీలకు సంబంధించి పా ర్టీ బీఫారాలను నేడు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేయనున్నారు. కాంగ్రె స్‌, బీజేపీ వారి అభ్యర్థులకు బీ-ఫారాలు అందించాయి. కాగా, కాం గ్రెస్‌, బీజేపీకి కొన్ని వార్డుల్లో అభ్యర్థులే లేకుండాపోయారు.


logo