శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 13, 2020 , 01:30:53

ఫిబ్రవరిలో కొత్త కలెక్టరేట్‌

ఫిబ్రవరిలో కొత్త కలెక్టరేట్‌
  • -ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • - పనుల్లో వేగం పెంచి, పూర్తి చేయాలి
  • - త్వరలోనే కంటి దవాఖాన
  • - ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
  • - కలెక్టరేట్‌, ఎల్వీ ప్రసాద్‌ దవాఖాన భవన నిర్మాణ పనుల పరిశీలన


 కొండపాక : మండలంలోని దుద్దెడ శివారులో నిర్మిస్తున్న  జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ నిర్మాణం పనులను ఫిబ్రవరి నెలాఖలోగా పూర్తి చేసిసీఎం కేసీఆర్‌తో ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కార్యాల యం ఎదుట పచ్చదనం పనులు వేగవంతం చేయాలన్నారు. ముఖఃద్వారం పనులను ఇంకా ఎందుకు ప్రారంభించలేదని? ప్రశ్నించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలని సూచనలు చేశారు. మెయిన్‌ బిల్డింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను పూర్తి చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. అనంతరం కాంట్రాక్టర్‌తో  మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. పనుల వేగం పెంచాలని, ఎట్టి పరిస్థితుల్లో కలెక్టరేట్‌ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ఇవ్వాలన్నారు. అనంతరం నాగులబండ వద్ద నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖాన పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. మంత్రి వెంట సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి ఉన్నారు.

ఆరోగ్య సిద్దిపేటను నిర్మిద్దాం..

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : స్వచ్ఛ, ఆకుపచ్చ, ఆరోగ్య సిద్దిపేట నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. ప్రతి ఒక్కరికి శుచి, శుభ్రత, నాణ్యమైన ఆహార పదార్థాలను అం దించాలని హోటల్‌ యజమానులు, వర్కర్లకు శిక్షణ ఇచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని ఎన్జీవోస్‌ భవన్‌లో హోటళ్లు, దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, కర్రీ పాయింట్స్‌ యజమాను లు, వర్కర్లకు కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో మరో అడుగు ముందుకేశామన్నారు. దేశంలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి ఆహార విక్రయశాల యజమానులు, కార్మికులకు శిక్షణ ఇచ్చిన ఏకైక పట్టణం సిద్దిపేటనే అన్నారు. మొత్తం 2వేల మందికి శిక్షణ ఇచ్చామని, ఇప్పటికే 800 మందికి శిక్షణ పూర్తి చేశామన్నా రు. రుచికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో శుచి శుభ్రతకు అంతే ప్రాధాన్యత ఇ వ్వాలని సూచించారు. 20 సూత్రాలు అమలు చేసే హోటళ్లు, తినుబండారా ల దుకాణాలకు గ్రేడింగ్‌ పద్ధతి అమలు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 15 నుంచి మార్చి 15 వరకు హోటళ్లను, టిఫిన్‌ సెంటర్లను మున్సిపల్‌ సిబ్బంది, స్వచ్ఛ ఆరోగ్య వలంటీర్లు సందర్శిస్తారన్నారు. 20 సూత్రాల అమలు ఆధారంగా కలర్‌ కోడింగ్‌ ఇస్తామని తెలి పారు.

20 సూత్రాలను అమలు చేస్తే గ్రీన్‌ కోడ్‌, 17 నుంచి 12 సూత్రా లను అమలు చేసినవారికి ఎల్లో, అంతకన్న తక్కువ  అమలు చేస్తే రెడ్‌ కోడ్‌ ఇస్తామని వివరించారు. ఆహార పదార్థాల విక్రయశాల యజమానులు, తయారీదారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలని, కల్తీ పదార్థాలు వాడరాదన్నారు. ఫిర్యాదుల రిజిష్టర్‌, ధరల పట్టికను హోటళ్లో ప్రదర్శించాలని సూచించారు. అనంతరం శిక్షణ తీసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌ పటేల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, శిక్షకుడు ఆంజనేయులు, కౌన్సిలర్లు ప్రభాకర్‌, నర్సయ్య, మల్లికార్జున్‌, మోయిజ్‌, రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు సంపత్‌రెడ్డి, ధర్మవరం బ్రహ్మం, సాకి ఆనంద్‌, హోటల్‌ యూనియన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్య

 సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే  కార్యక్రమాలు చేపట్టారు... విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో కొండపాక జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు జయశ్రీ ఉద్యోగ విరమణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ప్ర భుత్వ పరంగా పాఠశాలలకు అన్ని వసతులు అందజేస్తూ.. డిజిటల్‌ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్‌ విద్యకు ధీటుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo