ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 13, 2020 , 01:27:51

బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికలంటే భయం

బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికలంటే భయం
  • -మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గల్లంతే..
  • -శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట
  • -టీఆర్‌ఎస్‌లో బీజేపీ దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్‌ వంశీకృష్ణ చేరిక


 దుబ్బాక టౌన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు భయం పట్టుకుందని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో బీజేపీ దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్‌ పల్లె వంశీకృష్ణగౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. స్థానిక ఆర్యవైశ్య భవనంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల నడుమ చేరిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వంశీకృష్ణగౌడ్‌కు ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ... దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మనుగడ లేదని.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీల అడ్రస్‌ గల్లంతు అవుతుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యర్థి పార్టీలు జంకుతున్నాయని విమర్శించారు. వందశాతం గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలువాలని ఆయన పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడం అంటే.. అభివృద్ధ్దికి చిరునామాగా నిలువాలని సూచించారు. ఎవరికి ఏలాంటి ఇబ్బందులు కలిగినా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఐకమత్యంతో ముందు కు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకవెళ్లి.. ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దుబ్బాక మున్సిపాలిటీపై గులాబీ జెండాను ఎగురవేయడమే మనందరి ముందున్న ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే రామలింగారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి పార్టీ కం డువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, నాయకులు రొట్టె రాజమౌళి, గుండెల్లి ఎల్లారెడ్డి, కొత్త కిషన్‌రెడ్డి, పర్సకృష్ణ, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గన్నె వనిత, కొట్టె ఇందిర తదితరులు ఉన్నారు.


logo