ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 13, 2020 , 01:23:27

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

 ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
  • - జడ్పీవైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి
  • - అంతకపేట, రామవరంలో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ

అక్కన్నపేట : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. మండలంలోని అంతకపేటలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంపిణీ చేసే తడి, పొడి చెత్త బుట్టలను ఆదివారం జడ్పీవైస్‌ చైర్మన్‌ గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు పనులు విజయవంతంగా ముగియడంతో రెండో ధపా పల్లె ప్రగతి చేపట్టిందన్నారు. పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో నిరంతరంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కొనుగోలు చేసిన వాటర్‌ ట్యాంకర్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే రామవరంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంపిణీ చేసే చెత్త బుట్టలను జడ్పీటీసీ భూక్య మంగ గ్రామస్తులకు అందజేశారు.  కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఇర్రి లావణ్యరెడ్డి, వనపర్తి స్వప్న, ఎంపీటీసీలు కంది రజిత, లింగాల శ్రీనివాస్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ సర్వర్‌, పంచాయతీ కార్యదర్శులు, ఉపసర్పంచ్‌లు సమ్మయ్య, కనకయ్య పాల్గొన్నారు.

ముగిసిన పల్లె ప్రగతి..

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మండల వ్యాప్తంగా ఆదివారంతో ముగిసింది. చివరి రోజున ఆయా గ్రామ పంచాయతీల ఆవరణలో గ్రామ సభల నిర్వహించారు. మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో అక్కన్నపేట సర్పంచ్‌ ముత్యాల సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
హుస్నాబాద్‌రూరల్‌ : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మండలంలోని పలు గ్రామాల్లో ముగిసింది. ఇందులో భాగంగా ఆదివారం పందిల్లలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే వంగరామయ్యపల్లిలో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ చేశారు. మహ్మదాపూర్‌, నాగారం, గాంధీనగర్‌, వంగరామయ్యపల్లి తదితర గ్రామాల్లో పాలకవర్గాల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

తోటపల్లిలో చెత్తబుట్టల పంపిణీ

బెజ్జంకి : తోటపల్లిలో సర్పంచ్‌ బోయినిప ల్లి నర్సింగరావు గ్రామస్తులకు తడి,పొడి చెత్త బుట్టలను ఆ దివారం పంపిణీ చేశారు. స్థానిక చల్మెడ ఫీడ్స్‌ కంపెనీ వా రిని గ్రామస్తులకు చెత్తబుట్టలను అందించాలని సర్పంచ్‌ కోరగా సానుకూలంగా స్పందించి గ్రామస్తులకు అందించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మనోహర్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo