సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 12, 2020 , 00:13:41

దుబ్బాకలో ఒకటి తిరస్కరణ

దుబ్బాకలో ఒకటి తిరస్కరణ

దుబ్బాక టౌన్‌ : దుబ్బాకలో శనివారం అధికారులు నామినేషన్లను పరిశీలించి, ఒక నామినేషన్‌ను తిరస్కరించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య తెలిపారు. 20 వార్డుల్లో 143 మంది అభ్యర్థులు 230 నామినేషన్‌ సెట్లను దాఖలు చేయగా, పరిశీలనలో 7వ వార్డుకు చెందిన గడుగు రాజయ్య(స్వతంత్ర) ఒకే ప్రపోజర్‌తో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో ఒక నామినేషన్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 230 నామినేషన్లలో ఒక్క నామినేషన్‌ తిరస్కరించగా, 229 నామినేషన్లు అంగీకరించబడ్డాయన్నారు. ఈ నామినేషన్ల పరిశీలనను దుబ్బాక, సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు మాస్టర్‌ ట్రైనర్‌ చింతల శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. అత్యధిక నామినేషన్లు 4వ వార్డు (దుంపలపల్లి)లో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, అతి తక్కువగా 19వ వార్డు, 12వ వార్డులో నలుగురు చొప్పున నామినేషన్లు వేశారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీకి రూ. 3లక్షల 75వేల ఆదాయం వచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు.


logo