సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 12, 2020 , 00:10:12

సంక్రాంతి సంబురాలు

సంక్రాంతి సంబురాలు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : పట్టణంలోని పలు  పాఠశాలల్లో శనివారం సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్‌ మల్లికార్జున్‌ బహుమతులను అందజేశారు. సెలస్టియల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ కృష్ణమాచారి, డైరెక్టర్లు హన్మంతరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి బహుమతులు అందజేశారు. సంబురాల్లో భాగంగా విద్యార్థులకు భోగి పండ్లు పోయడం, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, హరిదాస్‌ కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు నిర్వహించారు.

సిద్దిపేట టౌన్‌ : సంక్రాంతి పండుగ పురస్కరించుకొని విద్యార్థులకు ముగ్గులు, పతంగుల పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ యాళ్ల భాస్కర్‌రెడ్డి, కరస్పాండెంట్‌ లిఖిత, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కేజీబీవిలో సంక్రాంతి సంబురాలు
సిద్దిపేట రూరల్‌ : మండలంలోని కేజీబీవి రాఘవాపూర్‌ పాఠశాలలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేత లకు స్పెషల్‌ ఆఫీసర్‌ కవిత బహుమతులు అందించారు. 

చిన్నకోడూరు/నంగునూరు : ఆయా మండలాల్లోని రామంచ ప్రాథమిక పాఠశాలతోపాటు ఘణపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
నారాయణరావుపేట : లక్ష్మీదేవిపల్లి, గుర్రాలగొంది, జక్కాపూర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో  ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ  బాలకృష్ణ, సర్పంచ్‌లు మంజుల, ఆంజనేయులు, పర్శరాములు, ఎంపీటీసీలు స్వప్న, హరీశ్‌, భాను, టీఆర్‌ఎస్‌ నాయకులు కిషన్‌, ఎల్లారెడ్డి, పద్మ, మధుకర్‌, పృథ్వీ, సాయికుమార్‌, అజయ్‌ ఉన్నారు.


logo