ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 09, 2020 , 18:56:56

అభివృద్ధికి అండగా నిలువండి

అభివృద్ధికి అండగా నిలువండి

దుబ్బాక టౌన్‌: ప్రతి ఒక్కరి సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలువాలని శాసనసభ అంచనాల క మిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. బుధవారం దుబ్బాకలో ఎస్సీ కాలనీలోని 13వ వార్డులో కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన సుమారు 50మందికి పైగా నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ కం డువా కప్పుకోవడమంటే అభివృద్ధికి అండగా నిలువడమేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా బాధ్యతతో సమస్యను పరిష్కరించుకుం టూ ముందుకు సాగుతామని తెలిపారు. మున్సిపల్‌ ఎ న్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బీజేపీకి చెందిన చెక్కపల్లి సుధాకర్‌, బాబు, కాంగ్రెస్‌కు చెందిన దొమ్మాట చిన్నరాజ య్య, రాంచంద్రం, వంశీ, సుమన్‌, మహేశ్‌, చిన్నరాజయ్య, దొమ్మాట యాదయ్య, చింటూ తదితరులు ఉ న్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, నాయకులు రాజమౌళి, ఆస స్వామి, తౌడ శ్రీనివా స్‌, పర్స కృష్ణ, రొట్టె రమేశ్‌, కట్కూరి రాంచంద్రం ఉన్నారు.


logo