ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 09, 2020 , 18:56:25

ఇద్దరు బాల కార్మికులకు విముక్తి

ఇద్దరు బాల కార్మికులకు విముక్తి

సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేట పట్టణంలో ఇద్దరు బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పాఠశాలలో చేర్పించినట్లు..ఆపరేషన్‌ స్మైల్‌ -6 డివిజన్‌ ఇన్‌చార్జి కనకయ్యగౌడ్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ స్వర్ణలత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కిషన్‌ సర్వీసింగ్‌ సెంటర్‌లో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న 16 సంవత్సరాల బాలుడు, ఆర్‌ఆర్‌ గ్లాస్‌ షాప్‌లో పనిచేస్తున్న 15 సంవత్సరాల బాలున్ని గుర్తించి బాల భవన్‌లోని సీడబ్ల్యూసీ అధికారుల ముందు హాజరుపర్చారు. సీడబ్ల్యూసీ మెంబర్‌ ఆత్మరాములు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇద్దరిని పాఠశాలలో చేర్పించారు. మంగళవారం రాత్రి తడ్కపల్లిలోని సోమన్నరాజు ఇటుక బట్టీలో పనిచేస్తున్న 10 మంది బాలకార్మికులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వగా ఈ నెల 13 నుంచి పని ప్రదేశంలోనే క్లాస్‌ రూం ఏర్పాటు చేసుకొని ఒడిషా నుంచి టీచర్‌ను నియమించారు. వారి చదువు కోసం బట్టీల యజమాని సహకరిస్తానని తెలుపడంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు.


logo