మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 09, 2020 , 18:55:48

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు

సిద్దిపేట టౌన్‌ : కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్య తిరేక విధానాలు నిరసిస్తూ విద్యుత్‌, పోస్టల్‌ ఉద్యోగులు దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు తెలిపి బుధవా రం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్ర త్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించాలని డి మాండ్‌ చేశారు. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు స మ్మెకు దిగాయి. కనీస వేతనం, సామాజిక భద్రతతో పాటు పలు డిమాండ్ల సాధనకు సమ్మె చే శారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఉద్యోగులు తూర్పారబట్టారు. కేంద్ర ప్ర భుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నా రు. సమ్మెలో ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధ రించి నిరసనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పో స్టల్‌ ఉద్యోగులు, నారాగౌడ్‌, హరీశ్‌, నరేందర్‌, చంద్రశేఖర్‌, కొండల్‌రెడ్డి, ఆంజనేయులు, నాం పల్లి, విద్యుత్‌ ఉద్యోగులు మధు పాల్గొన్నారు.


logo