శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 15, 2020 , 00:24:26

వాయుసేన పిలుస్తోంది

వాయుసేన పిలుస్తోంది
  • ఉద్యోగ నియామక ర్యాలీకి వేదిక సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ
  • రెండు వైద్య శిబిరాలు, అగ్ని మాపక వాహనాల ఏర్పాటు
  • కలెక్టర్‌ హనుమంతరావు అధ్యక్షతన ఏర్పాట్ల కమిటీ
  • పదివేల మంది వరకు హాజరు
  • రెండు రకాల వాయుసేన ఉద్యోగాల భర్తీ
  • తెలంగాణ వ్యాప్తంగా జేఎన్‌టీయూలోనే ఎంపిక
  • 16 నుంచి 21వరకు వాయుసేన ర్యాలీలు

రెండు విడుతల్లో పదివేల మంది..

జేఎన్‌టీయూలో నిర్వహించే వాయుసేన నియామక ర్యాలీలో రెండు విడుతల్లో 10 వేల మంది అభ్యర్థుల వరకు హాజరు అవుతారని వాయుసేన అధికారి నరేంద్రకుమార్‌ కర్‌ తెలిపారు. వాయుసేన సిబ్బంది 16వ తేదీన ఉదయమే చేరుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరుకానున్నారు. మొదటి విడుతలో 14 జిల్లాల అభ్యర్థులు, రెండో విడుతలో 19 జిల్లాల అభ్యర్థులు పాల్గొంటారని వాయుసేన అధికారులు తెలిపారు.  


రెండు  వైద్య శిబిరాలు

జేఎన్‌టీయూలో నిర్వహించే వాయుసేన ర్యాలీ నేపథ్యంలో కళాశాల ప్రాంగణంలో రెండు వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. ఆరు రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు ఉంటాయి. ఇందుకోసం జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారికి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రాంగణంలో రెండు వైద్య శిబిరాల్లో ప్రథమ చికిత్స, గుండెకు సంబంధించిన వైద్యనిపుణులు, అగ్నిమాపక దళ వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు.మొదటి విడుతలో...

వాయుసేన నియామక (ర్యాలీ) మొదటి విడుతలో ఈ కింద సూచించిన జిల్లాల అభ్యర్థులు ఈనెల 17 ఉదయం 5 గంటల వరకు జేఎన్‌టీయూ ప్రాంగణానికి చేరుకోవాలి. దూరం నుంచి వచ్చే అభ్యర్థులు 16వ తేదీనే కళాశాలకు చేరుకోవచ్చు. అందుకు వాయుసేన విభాగం, కళాశాల యాజమాన్యాలు అన్ని సౌకర్యాలు కల్పించారు.

1. నల్లగొండ, 2. సూర్యపేట, 3. యాదాద్రి-భువనగిరి, 4. నిజామాబాద్‌, 5. కామారెడ్డి, 6. రంగారెడ్డి, 7. మేడ్చల్‌, 8. వికారాబాద్‌, 9. వరంగల్‌ రూరల్‌, 10. వరంగల్‌ అర్బన్‌, 11. జనగామ, 12. జయశంకర్‌ భూపాలపల్లి, 13. మహబూబాబాద్‌, 14. హైదరాబాద్‌ వారికి 17వ తేదీన ఉదయం 5 గంటలకు నుంచి ముందుగా ఎత్తు కొలతలు చూసి, దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు తర్వాత రోజు రాత పరీక్ష ఉంటుంది.


రెండో విడుతలో...

రెండో విడుతలో నియామకానికి కింద తెలిపిన జిల్లాల అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. వీరికి 20వ తేదీన ఉదయం 5 గంటలలోపు జేఎన్‌టీయూ ప్రాంగణానికి రావాల్సింటుంది. దూరం నుంచి వచ్చే అభ్యర్థులు 19న కళాశాలకు చేరుకోవచ్చు. వీరికి కళాశాలలో భోజనం, బోర్డింగ్‌ సదుపాయం కల్పించారు. ముందుగా ఎత్తు కొలతలు తీసుకుని ఎంపికైన అర్హులకు శారీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష వీలును బట్టి అదేరోజు లేద మరుసటి రోజు నిర్వహిస్తారు.

1. ఆదిలాబాద్‌, 2. కొమ్రం భీం ఆసిఫాబాద్‌, 3. మంచిర్యాల, 4. నిర్మల్‌, 5. కరీంనగర్‌, 8. జగిత్యాల, 9. పెద్దపల్లి, 10. రాజన్న సిరిసిల్ల, 11. భద్రాది కొత్తగూడెం, 12. ఖమ్మం, 13. జోగులాంబ గద్వాల, 14. మహబూబ్‌నగర్‌, 15. నాగర్‌కర్నూల్‌, 16. వనపర్తి, 17. మెదక్‌, 18. సంగారెడ్డి, 19. సిద్దిపేట జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని వాయుసేన అధికారి తెలిపారు.


ముమ్మరంగా ఏర్పాట్లు..

ఈ నెల 16 నుంచి 21వరకు నిర్వహించే వాయుసేన ఉద్యోగాల నియామకానికి సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో ముమ్మరంగా ఏ ర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నియామక ర్యాలీని విజయవంతం చేయడానికి ప్రభు త్వం కమిటీని నియమించింది. కలెక్టర్‌ హనుమంతరావు అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. సంగారెడ్డి ఆర్డీవో నగేశ్‌, పుల్కల్‌ తాసిల్దార్‌ మురళి, జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపాల్‌ బాలూనాయక్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌, రెవెన్యూ అధికారి షఫీ, పుల్కల్‌ ఎస్సై పెంటయ్య తో కూడాని కమిటీని నియమించా రు. ఈ కమిటీ సభ్యులు పక్షం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాయుసేన ఉద్యోగ ర్యాలీకి హాజర య్యే అభ్యర్థులకు కళాశాలలో విద్యుత్‌ సరఫరా, గ్రౌండ్‌ను పరిశుభ్రపర్చుట, భోజ న వసతి, రాత్రి బసచేసేందుకు అభ్యర్థులకు బోర్డింగ్‌ వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.


logo