మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 15, 2020 , 00:21:36

చైనా మాంజా నిషేధం.. అమ్మితే జైలు

చైనా మాంజా నిషేధం.. అమ్మితే జైలు

సిద్దిపేట టౌన్‌ : పక్షుల ప్రాణాలకు, మనుషులకు హాని కలిగించే చైనా మాంజా ని షేధంలో ఉందని, వ్యాపారస్తులు ఎవరై నా దిగుమతి చేసుకున్నా, రవాణా చే సి నా, అమ్మినా, కొనుగోలు చేసినా వా రిని జైలుకు పంపుతామని సిద్దిపేట డి ప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ లింగమూర్తి స్ప ష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళవా రం ఆయన మాట్లాడుతూ చైనా మాంజా సీసంతో తయారు చేసిన మాంజాలు  మూడు సంవత్సరాలుగా పూర్తిగా నిషేధించామని చెప్పారు. వన్య ప్రాణ  సంరక్షణ చట్టం -1972 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. వన్య ప్రా ణుల ప్రాణాలను హరించే హక్కు ఎవరికీ లేదని, స్వేచ్ఛాయుత వాతావరణంలో మనతో పాటు అవి జీవించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. పతంగులతో పాటు పక్షులను స్వేచ్ఛగా ఎగురనిద్దామని నినాదంతో చైనా మాంజాతో కలుగుతున్న అనర్థాలను ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. ఎవరైనా చైనా మాంజా అమ్మితే టోల్‌ ఫ్రీ నంబరు 18004255364 లేదా 04023231440 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. అందులో భాగంగా జిల్లా కేంద్రం సిద్దిపేటలో అటవీ శాఖ సిబ్బందితో కలిసి పతంగులు విక్రయించే దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశామని తెలిపారు. 


logo