మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 15, 2020 , 00:20:45

అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలి

అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలి

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం హుస్నాబాద్‌ మండల పరిషత్‌ సమావేశ మందిరం లో పోటీలో ఉండబోయే అభ్యర్థులకు అవగాహ సదస్సు జరిగిం ది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ ర్డీవో మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి రూ.లక్షకు మించకుండా ఖర్చు చేయాలన్నా రు. ఖ ర్చులు, ప్రచార తీరు, వాహనాల వినియోగం, మైక్‌ వినియోగం ఎలా చేయాలనేదానిపై ప్రతి అభ్యర్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చు బ్యాంకు ద్వారానే చేయాలని సూచించారు. అభ్యర్థులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూ షణలకు దిగొద్దని, ప్రభుత్వ స్థలాలు, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయొద్దన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడం గానీ, ఇబ్బందులకు గురిచేయడం గానీ చేయకూడదన్నారు. సమావేశంలో ఏసీపీ ఎస్‌ మహేందర్‌, ఎస్‌ఐ దాస సుధాకర్‌, మాస్టర్‌ ట్రైనర్‌ రామకృష్ణారెడ్డి, పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు. 


logo