శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Jan 15, 2020 , 00:19:05

వాయుసేన ర్యాలీకి ముమ్మర ఏర్పాట్లు

వాయుసేన ర్యాలీకి ముమ్మర ఏర్పాట్లుపుల్కల్‌: జేఎన్‌టీయూలో వాయుసేన ఉద్యోగ ర్యాలీకి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 16 నుంచి 21 వరకు నిర్వహించే వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీ జరుగుతుంది. ఇందుకోసం కలెక్టర్‌ హనుమంతరావు అధ్యక్షతన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఫిజికల్‌గా ఎంపికైన అభ్యర్థులకు రాత పరీక్ష కోసం పెద్దహాల్‌ను ఎంపిక చేశారు.  


పర్యవేక్షణ కమిటీ..

ఈనెల 16 నుంచి 21 వరకు జరుగు వాయుసేన ర్యాలీకి కలెక్టర్‌ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ పనులు చేస్తున్నది. ఈ కమిటీలో సంగారెడ్డి ఆర్డీవో నగేశ్‌, పుల్కల్‌ తాసిల్దార్‌ మురళి, ఎస్‌ఐ పెంటయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ బాలూనాయక్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌, జోగిపేట ఆర్‌ఐ షఫీతో పర్యవేక్షణ కమిటీ వేసి ఏర్పాట్లను చేస్తున్నారు.


-వాయుసేన నియామక ర్యాలీ జరిగే వారం రోజుల పాటు వివిధ పనులను విభజన చేసి అధికారులకు అప్పగించారు.

- పుల్కల్‌ డిప్యూటీ తాసిల్దార్‌ వంశీధర్‌, పుల్కల్‌ గిర్దవార్‌ నయీంకు ఫర్నిచర్‌ను సమకూర్చే బాధ్యత అప్పగించారు. వాయు సేన ఉద్యోగ నియామక స్థలం, వేదికల వద్ద ఫర్నిచర్‌ సమకూర్చాలి. ఈ అధికారులకు 10 మంది వీఆర్వోలను అప్పగించారు. వీరంతా డిప్యూటీ తాసిల్దార్‌ పర్యవేక్షణలో పనిచేస్తారు. అందరూ కలిసి ఈనెల 15వ తేదీ వరకు ఫర్నిచర్‌ను సమకూర్చాలి. 16 నుంచి మధ్యాహ్నం అర్హత సాధించిన అభ్యర్థులకు భోజనాలు, తాగునీరు సమకూర్చాలి.

- అందోల్‌ గిర్దవార్‌ అనంతయ్యకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రధాన గేట్‌ వద్ద విధులను నిర్వర్తించే వాయుసేన అధికారికి సహాయకులుగా వ్యవహరిస్తారు. ఇతడికి ఓ వీఆర్వో సహాయకులుగా ఉంటారు.

- హత్నూర గిర్దవార్‌ గంగాధర్‌కు కళాశాల ప్రధాన గేట్‌ ఎదుట అభ్యర్థుల లగేజీ, అభ్యర్థుల అసెంబ్లీ బాధ్యతలను అప్పగించారు. ఇతడికి ఒకరు లేదా ఇద్దరు వీఆర్వోలు సహాయకులుగా ఉంటారు.

l గుమ్మడిదల మండల తాసిల్దార్‌ సతీశ్‌, గిర్దవార్‌ ఆరీఫ్‌కు రెవెన్యూ సిబ్బందికి, పోలీస్‌ సిబ్బందికి భోజనాలు, తాగునీరు, స్నాక్స్‌ సమకూర్చే బాధ్యత అప్పగించారు.

l హత్నూర తాసిల్దార్‌ చంద్రశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌కు వాయుసేన అధికారులకు, సిబ్బందికి భోజనాలు, తాగునీరు అందించే బాధ్యతను అప్పగించారు.

l మునిపల్లి మండల తాసిల్దార్‌ వీరేశానికి జేఎన్‌టీయూ అథితి గృహం వద్ద వీవీఐపీలకు భోజనాలు, వసతులు కల్పించే బాధ్యతను అప్పగించారు. ఈ అధికారికి ఇద్దరు వీఆర్వోలను, నలుగురు వీఆర్‌ఏలను సహాయకులుగా నియమించారు.

-కొండాపూర్‌ మండల డిప్యూటీ తాసిల్దార్‌ సతీశ్‌, పటాన్‌చెరు డిప్యూటీ తాసిల్దార్‌ అశోక్‌, వట్‌పల్లి డిప్యూటీ తాసిల్దార్‌ గంగాదర్‌, కంది డిప్యూటీ తాసిల్దార్‌ మల్లయ్యలను అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రం వద్ద నియమించారు. వీరు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేస్తారు. వీరికి సహాయకులుగా వారి మండలాల నుంచే ఇద్దరు వీఆర్వోలను నియమించుకోనున్నారు.

- పుల్కల్‌ తాసిల్దార్‌ మురళి, మునిపల్లి తాసిల్దార్‌ ప్రవీణ్‌, హత్నూర తాసిల్దార్‌ జయరాంలను ఆర్డీవో, కలెక్టర్లకు సహాయకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

-అందోల్‌ మండల తాసిల్దార్‌ కార్యాలయ ఎన్నికల అధికారి షఫీయోద్దీన్‌, పుల్కల్‌ తాసిల్దార్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, మునిపల్లి తాసిల్దార్‌ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ లింగం, అందోల్‌ తాసిల్దార్‌ వీఆర్వో వాయుసేన నియామక ర్యాలీ వద్ద భోజనాల సరఫరా, టెంట్లను ఏర్పాటు చేసే బాధ్యతలను అప్పగించారు. వీరికి 4 వీఆర్వోలు, 10 మంది వీఆర్‌ఏలు సహాయకులుగా వ్యవహరిస్తారు.

300 మందితో వాయుసేన సిబ్బంది...

జేఎన్‌టీయూలో 16 నుంచి 21వరకు జరిగే 12వ వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీకి 300 మంది వాయుసేన అధికారులు, సిబ్బంది పాల్గొంటారని సికింద్రాబాద్‌ రెజిమెంట్‌ క మాండర్‌, 12వ వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీ ఇన్‌చార్జి నరేంద్ర కుమార్‌ కర్‌ తెలిపారు. వారం రోజుల పాటు ఉండటానికి వాయుసేన సెలక్షన్‌ కమిటీకి కళాశాల అతిథి గృహం, సిబ్బ ందికి జేఎన్‌టీయూలోని సివిల్‌ బ్లాక్‌లను వసతికోసం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాయుసేనలో ఎంపికైన అభ్యర్థులు మరుసటి రోజు రాత పరీక్ష రాయడానికి అదనంగా మరికొన్ని బ్లాకులను కేటాయిండమే కాకుండా బాలుర వసతి గృహాలను కూడా ఉపయోగించుకోమని ఉత్తర్వులు జారీ చేశారు.


logo