సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 27: సిద్దిపేటలో జాతిరత్నాలు ఫేమ్ హీరోయిన్ చిట్టి (ఫరియా) సందడి చేసింది. వైభవం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరోయిన్ చిట్టి షోరూమ్‌లో కలియతిరిగి వస్ర్తాలను పరిశీలించింది. ఈ సందర్భంగా హంగామా చేసింది. జాతిరత్నాలు సినిమాలోని పాటలకు స్టెప్స్ వేస్తూ స్వయంగా గొంతు కలిపి డ్యాన్స్ చేసింది. హీరోయిన్ను చూసేందుకు వచ్చిన యువత ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. షోరూమ్ ప్రాంగణమంతా ఉర్రూతలూగింది. షాపింగ్ మాల్లో నూతన కలెక్షన్స్, అన్ని రకాల పట్టు వస్ర్తాలు, నాణ్యమైన వస్ర్తాలు తక్కువ ధరలకే లభించనున్నాయని, ప్రజలందరూ షాపింగ్ మాల్‌ను ఆదరించి అక్కున చేర్చుకోవాలని ఆమె సూచించారు. సుమారు గంట పాటు హీరోయిన్ ఫరియా సందడి చేసింది.
ప్రజలకు నాణ్యమైన వస్ర్తాలు అందించాలి : వైభవం షాపింగ్ మాల్ ప్రారంభంలో మంత్రి హరీశ్‌రావు
ప్రజలకు నాణ్యమైన వస్ర్తాలను అందించి వారికి చేరువవ్వాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట సుభాష్ రోడ్లో వైభవం షాపింగ్ మాల్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. షాపింగ్ మాల్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పెద్ద పట్టణాలకు దీటుగా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో అన్ని రకాల షాపింగ్ మాళ్లు వెలిశాయని చెప్పారు. ఇక్కడ ప్రజలకు నాణ్యమైన బట్టలను అందించి ప్రజల మనసును గెలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు పాల్గొన్నారు.