e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home మెదక్ ధాన్యసిరి

ధాన్యసిరి

  • రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం
  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 898 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు
  • 2,22,779 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ

సిద్దిపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విస్తారంగా కురిసిన వర్షాలకు తోడు గోదావరి జలాల రాకతో ఉమ్మ డి మెదక్‌ జిల్లాలో యాసంగిలో పుట్లకొద్దీ ధాన్యం పడింది. కా గా, కరోనా కష్టకాలంలో రైతులు ఇబ్బంది పడకుండా ప్రభు త్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో చివరి గింజ వరకూ ధాన్యాన్ని సేకరించింది. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో 2,22,779 మంది రైతుల నుంచి 11,67,924.560 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వీటికి సంబంధించి రూ.2,204.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 898 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి యాసంగిలో విజయవంతంగా ధాన్యాన్ని సేకరించింది. దీంతో రైతులకు పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి రంది లేకుండా పోయింది. దళారుల బెడద తప్పింది. ఇదే ఉత్సాహంతో వానకాలం సాగులో రైతులు నిమగ్నమయ్యారు.

సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో మహిళా సంఘాలు, సొసైటీల, మార్కెట్‌ కమిటీల ద్వారా 405 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. వీటిలో మహిళా సంఘాల ద్వారా 224 కేంద్రాల ద్వారా 61,456 మంది రైతులు, సొసైటీల ద్వారా 169 కేంద్రాల నుంచి 46,497 మంది రైతులు, ఏఎంసీల ద్వారా 8 కేంద్రాల నుంచి 3,990 మంది రైతుల నుంచి ధా న్యం కొనుగోలు చేశారు. మెప్మా ద్వారా 4 కేంద్రాలను ఏర్పా టు చేసి 1,465 మంది రైతుల ధాన్యం సేకరించారు. మొత్తం 405 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,13,408 మంది రైతుల నుంచి 5,42,806.120 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి నేరుగా రైతుల వ్యక్తిగత ఖాతాల్లో రూ. 1024,05 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

- Advertisement -

మెదక్‌ జిల్లాలో ..
మెదక్‌ జిల్లాలో సొసైటీలు, మహిళా సంఘాలు, మార్కెటింగ్‌ శాఖ ద్వారా ప్రభుత్వం 350 కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేసింది. వీటి ద్వారా 72,106 మంది రైతుల నుంచి 4,42,193. 640 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, రూ. 834.86 కోట్లు నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. జిల్లాలో సొసైటీల ద్వారా 236 కేంద్రాలను ప్రారంభించి 52,947మంది రైతులు, మహిళా సంఘాల ద్వారా 110 కేంద్రాలను ప్రారంభించి 17,959 మంది రైతులు, మార్కెటింగ్‌ శాఖ ద్వారా 4 కేంద్రాలను ప్రారంభించి 1200 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో ..
సంగారెడ్డి జిల్లాలో 143 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరించారు. జిల్లాలో మొత్తం 37,265 మంది రైతుల నుంచి 1,82,924.800 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 345.36 కోట్లు జమ చేశారు. మహిళా సంఘాల ద్వారా 83,741.320 మెట్రిక్‌ టన్నులు, సొసైటీలు, ఏఎంసీల ద్వారా 99,183.480 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana