e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home మెదక్ మీ రక్షణ.. మా బాధ్యత

మీ రక్షణ.. మా బాధ్యత

 • వర్షాలు, వరదలతో జాగ్రత్త
 • అందుబాటులో ‘టోల్‌ ఫ్రీ నంబర్‌ 100’
 • ప్రజలకు పోలీసుల సూచన

సిద్దిపేట టౌన్‌, జూలై 23 : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదకర నీటి ప్రవాహ ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్‌ చేస్తున్నారు. ‘మీ రక్షణ.. మా బాధ్యత’ అనే నినాదంతో సేవలందిస్తున్నారు. అత్యవసర సమయంలో ‘పోలీసు టోల్‌ ఫ్రీ నంబర్‌ 100’ అందుబాటులో ఉంచారు.

పోలీసుల సూచనలు, జాగ్రత్తలు..

 • చిన్న పిల్లలు, ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లోకి ఈతకు గానీ, చేపల వేటకు వెళ్లొద్దు. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టాలి.
 • ప్రయాణించేటప్పుడు వాహనదారులు జాగ్రత్త వహించాలి. వర్షానికి రోడ్లు కొట్టుకపోయి గుంతలు ఏర్పడి నీరు నిలుస్తుంది. ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదాలకు గురయ్యే
 • అవకాశం ఉంది. ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి.
 • వరదలతో డ్రైనేజీ కాల్వలు, మ్యాన్‌హోల్స్‌ వాటికవే తెరవబడి ఉంటాయి. ప్రయాణికులు, ప్రజలు జాగ్రత్తగా కనిపెట్టాలి.
 • ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయొద్దు. దీని ద్వారా డ్రైనేజీలో చెత్త పేరుకపోయి ఇండ్లలోకి దుర్గంధం వ్యాపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
 • ప్రజలు తాగునీటిని ఫిల్టర్‌ చేసి గానీ, వేడి చేసి చల్లార్చి తాగాలి.
 • వర్షాలకు కల్వర్టుల వద్ద చిన్న చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనదారులు దాటడానికి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయొద్దు.
 • వరద నీటికి చెరువులు, కుంటలు నిండి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
 • రైతులు వ్యవసాయ బావుల వద్ద, బోర్ల వద్ద కరెంట్‌ స్విచాన్‌ చేసేముందు తడి చేతులతో స్టార్టర్‌ బాక్సులను, ఫీజు బాక్సులు ముట్టుకోవద్దు.
 • గాలులు వీస్తున్నప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు రైతులు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండొద్దు. ఇండ్లలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. నిరుపయోగంగా పడేసిన పాత కూలర్లు,
 • ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీని ద్వారా దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది.
 • శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో, మట్టి గోడలతో నిర్మించిన ఇండ్లలో నివాసం ఉండొద్దు. వర్షాలకు నాని కూలిపోయే ప్రమాదం ఉంది.
 • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్‌ స్తంభాలు, గోడలను తాకొద్దు. ఇనుప జే వైర్ల పై బట్టలు ఆరేయవద్దు.
 • ప్రజలందరూ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
- Advertisement -

పోలీసులను అభినందించిన సిద్దిపేట సీపీ

శిక్షల శాతం పెరిగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని, నేరస్తుల్లో మార్పు వస్తుందని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. గ్రేవ్‌, ఫోక్సో, క్రైమ్‌ అగెనెస్ట్‌ ఉమెన్‌, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, కోర్టు డ్యూటీ అధికారులకు కమిషనరేట్‌ కార్యాలయంలో ఒక రోజు శిక్షణా శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేవ్‌, ఫోక్స్‌, క్రైమ్‌ అగెనెస్ట్‌ ఉమెన్‌, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచాలని పోలీసులకు సూచించారు. సమన్స్‌, వారెంట్‌, కోర్టు డిస్పోజల్‌, కన్వెన్షన్‌, కాంప్రమైజ్‌ తదితర సమాచారాన్ని ప్రతి రోజు సీసీటీఎన్‌ఎస్‌లో డాటా నమోదు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డాటాను వారం రోజుల్లో పూర్తి చేయాలని పోలీసులను సూచించారు. ఎస్సీ, ఎస్టీ, క్రైమ్‌ అగెనెస్ట్‌ ఉమెన్‌, ఫోక్సో కేసుల్లో శిక్షల శాతం కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక కమిషన్లు, హైకోర్టు, సుప్రీం కోర్టులు ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుపుతున్నదని తెలిపారు. గ్రేవ్‌ కేసుల్లో ట్రయల్‌ సమయంలో శిక్షలు పడడానికి సాక్షులను మోటివేట్‌ చేయాలన్నారు. సంబంధిత పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో సత్సంబంధాలు పెట్టుకొని కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు.

సెషన్‌ కోర్టు పరిధిలో ట్రయల్‌ నడిచే ఫోక్సో, హత్య, లైంగికదాడి తదితర కేసులను లక్ష్యంగా పెట్టుకొని నేరస్తులకు శిక్ష పడేలా సాక్ష్యులను మోటివేట్‌ చేయాలని సూచించారు. కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులను డిస్పోజల్‌ చేసిన సిద్దిపేట వన్‌టౌన్‌, రూరల్‌, గజ్వేల్‌, దుబ్బాక, భూంపల్లి, కుకునూరుపల్లి కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. వీరందరికీ రివార్డు అందజేస్తామని తెలిపారు. అంతకు ముందు ఐటీ కోర్స్‌ ట్రైనింగ్‌ కో- ఆర్డినేటర్‌ శ్రీధర్‌ సీసీటీఎన్‌ఎస్‌లో పెండింగ్‌లో ఉన్న డాటా వివరాలు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పోలీసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్సై స్వామిదాస్‌, కానిస్టేబుల్‌ రాజమల్లు, హెడ్‌కానిస్టేబుల్‌ మిస్బాఉద్ద్దీన్‌, కానిస్టేబుల్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana