e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News బృహత్‌ పల్లెప్రకృతి వనం కోసం స్థల పరిశీలన

బృహత్‌ పల్లెప్రకృతి వనం కోసం స్థల పరిశీలన

బృహత్‌ పల్లెప్రకృతి వనం కోసం స్థల పరిశీలన

వెల్దుర్తి, జూలై 19: గ్రామాలను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా చేపట్టిన బృహత్‌ పల్లెప్రకృతి వనాల కోసం మం డలంలో స్థలాలను గుర్తిస్తున్నట్లు వెల్దుర్తి ఎంపీడీవో జగదీశ్వరాచారి అన్నారు. సోమవారం మాసాయిపేట మండల పరిధిలో ఏర్పాటు చేసే బృహత్‌ పల్లెప్రకృతి వనం కోసం రామంతపూర్‌లో 10 ఎకరాల స్థలాన్ని ఏపీవో రాజు, కార్యదర్శి వినోద్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వెల్దుర్తి మండలంలో మన్నెవారి జలాల్‌పూర్‌, మాసాయిపేట మండలంలో రామంతపూర్‌లో ఏర్పాటు చే స్తున్నామన్నారు.ఇందుకోసం10ఎకరాల చొప్పున స్థలాలను గుర్తించామని, త్వరలోనే ఉన్నతాధికారులకు వివరా లను అందజేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

ఈజీఎస్‌ నిధులతో పల్లె ప్రకృతి వనం
ఆరోగ్యవంతమైన సమాజానికి పల్లె ప్రకృతి వనాలు దోహదపడుతాయని కొల్చారం జడ్సీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల అన్నారు. కొల్చారంలోని తిరుమలయ్య పల్లె ప్రకృతి వనం సమీపంలోని సర్వే నంబర్‌ 707లో ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనానికి సర్పంచ్‌ ఉమారాజాగౌడ్‌తో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పా టు చేయనున్న పార్కు ఈజీఎస్‌ నిధుల నుంచి రూ.43 లక్ష లు మంజూరైనట్లు, ఎంపీపీ, జడ్పీటీసీ నిధుల నుంచి మ రిన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఏపీవో మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ చెన్నయ్య పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బృహత్‌ పల్లెప్రకృతి వనం కోసం స్థల పరిశీలన
బృహత్‌ పల్లెప్రకృతి వనం కోసం స్థల పరిశీలన
బృహత్‌ పల్లెప్రకృతి వనం కోసం స్థల పరిశీలన

ట్రెండింగ్‌

Advertisement