శుక్రవారం 05 మార్చి 2021
Science-technology - Jan 05, 2021 , 14:32:09

108 మెగాపిక్సెల్ కెమెరాతో విడుదలైన ‘Mi 10i’ 5జీ ఫోన్‌

108 మెగాపిక్సెల్ కెమెరాతో విడుదలైన ‘Mi 10i’ 5జీ ఫోన్‌

ముంబై:  చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ   షియోమీ మరో అద్భుతమైన MI 10I 5జీ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.  కొత్త ఏడాది తొలి వారంలోనే 108 మెగాపిక్సల్‌ రిజల్యూషన్‌తో సరికొత్త కెమెరా సెన్సార్‌తో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేసింది.

షియోమీ ఎంఐ 10 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఎంఐ 10టీ,  ఎంఐ 10 టీ ప్రో,  ఎంఐ 10 5జీ మోడళ్లను విడుదల చేసింది. ఎంఐ 10 ప్రారంభ ధర రూ.20,999గా నిర్ణయించారు.  ఐసీఐసీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 2వేల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది. 10వేల విలువైన రిలయన్స్‌ జియో ప్రయోజనాలను పొందొచ్చు. 

ఎంఐ 10ఐ  మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .20,999, కాగా  6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .21,999గా ఉండగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999గా నిర్ణయించారు.  

ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:6.67 అంగుళాలు

ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ

ఫ్రంట్‌ కెమెరా:16 మెగా పిక్సెల్‌

రియర్‌ కెమెరా: 108+8+2+2 మెగా పిక్సెల్‌

ర్యామ్‌:6జీబీ

స్టోరేజ్‌:128జీబీ

బ్యాటరీ కెపాసిటీ:4820mAh

ఓఎస్‌:ఆండ్రాయిడ్‌

VIDEOS

logo