మంగళవారం 19 జనవరి 2021
Science-technology - Dec 01, 2020 , 15:17:37

2020లో గూగుల్ ప్లే స్టోర్ బెస్ట్ యాప్ ఇదే

2020లో గూగుల్ ప్లే స్టోర్ బెస్ట్ యాప్ ఇదే

ఇండియ‌న్ స్టార్ట‌ప్ వైసాకు చెందిన మెడిటేష‌న్ యాప్ 2020 గూగుల్ ప్లే స్టోర్‌ బెస్ట్ యాప్‌గా నిలిచింది. ఈ యాప్ పేరు స్లీప్ స్టోరీస్ ఫ‌ర్ కామ్ స్లీప్ - మెడిటేట్ విత్ వైసా. మంచి నిద్ర కోసం వైసా ఈ యాప్ రిలీజ్ చేసింది. వినూత్న‌మైన ఈ యాప్ ఈ ఏడాది త‌మ‌కు ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ద‌ని త‌న అవార్డుల పేజీలో గూగుల్ ప్ర‌శంసించింది. మెద‌డుకు విశ్రాంతినిచ్చి, హాయిగా నిద్ర‌ప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన టూల్స్‌, ఎక్సర్‌సైజులు ఈ యాప్‌లో ఉంటాయి. అవ‌స‌ర‌మైతే స్లీప్ థెర‌పిస్ట్‌తో వ‌న్ ఆన్ వ‌న్ సెష‌న్ కూడా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. భార‌త పారిశ్రామిక‌వేత్త జో అగ‌ర్వాల్ ఈ యాప్‌ను తీసుకొచ్చారు. అంతేకాదు చాట్‌బోట్ మోడ‌ల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను కూడా అభివృద్ధి చేసే ప‌నిలో వైసా ఉంది. క‌రోనా వ‌ల్ల ఇప్పుడు చాలా మంది మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ల కోసం ఈ యాప్ బాగా ప‌నికొస్తోంది.