శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 22, 2021 , 16:38:33

ఈ ఫొటోలో మీకు ఏ ఆకారం క‌నిపిస్తుందో చెప్ప‌గ‌ల‌రా?

ఈ ఫొటోలో మీకు ఏ ఆకారం క‌నిపిస్తుందో చెప్ప‌గ‌ల‌రా?

అప్పుడప్పుడు మ‌న‌కు ఆకాశంలోని మేఘాలు, పెద్ద పెద్ద బండ‌రాళ్లు, న‌క్ష‌త్రాల్లో వింత వింత ఆకారాలు క‌నిపిస్తుంటాయి. ఇలాగే అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసాకు కూడా విశ్వంలోని ఓ ప్రాంతానికి చెందిన ఫొటోను చూసిన‌ప్పుడు ఓ ఆకారం క‌నిపించింద‌ట‌. దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ఆ ఆకారమేంటో మీరు గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా అని ఖ‌గోళ ప్రేమికుల మెద‌డుకు మేత పెట్టింది. విశ్వంలోని ఈ ప్రాంతాన్ని ఎన్‌జీసీ 7822గా పిలుస్తారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. మీరు బాగా ప‌రిశీలిస్తే ఇందులో ఓ జంతువు ఆకారం మీకు క‌నిపిస్తుంది అని నాసాకు చెందిన చంద్ర ఎక్స్‌-రే ఆబ్జ‌ర్వేట‌రీ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఇలా మేఘాల్లో, రాళ్ల‌ల్లో, న‌క్ష‌త్రాల్లో ఆకారాల‌ను చూడ‌టాన్ని పెరీడోలియా అంటార‌ని కూడా చెప్పింది. భూమి నుంచి 3 వేల కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఏ ఆకారంలో ఉందో చెప్ప‌గ‌ల‌రా అని అడిగింది. స్క్విరెల్డ్ అవే అని చెబుతూ త‌న పోస్ట్‌లోనే ఓ క్లూ కూడా ఇచ్చింది. దీనికి ఎంతోమంది ర‌క‌ర‌కాల స‌మాధానాలు చెప్పినా.. అస‌లు స‌మాధానం మాత్రం స్క్విరెల్ (ఉడుత‌) అట‌. మీకు క‌నిపించిందా మ‌రి?

VIDEOS

logo