ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 17, 2021 , 11:11:05

వాట్సాప్ కొత్త‌ స్టేట‌స్ చూశారా?

వాట్సాప్ కొత్త‌ స్టేట‌స్ చూశారా?

చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తోంది వాట్సాప్‌. మా ప్రైవ‌సీ పాల‌సీ మారుతోంది.. మీ డేటా అంతా మా మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటాం. దీనికి అంగీక‌రిస్తేనే వాట్సాప్ వాడండి.. లేదంటే లేదు అని యూజ‌ర్ల‌కు నోటిఫికేషన్ పంపిన వాట్సాప్‌.. యూజ‌ర్లు ఎదురు తిర‌గ‌డంతో ఇప్పుడు వాళ్ల‌ను బ‌తిమాలే ప‌నిలో ప‌డింది. మీ ప్రైవ‌సీకి ఎలాంటి భంగం వాటిల్ల‌బోదు అని ఎలాగోలా యూజ‌ర్ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నాలు తీవ్రంగా చేస్తోంది. ఇప్ప‌టికే కొత్త ప్రైవ‌సీ పాల‌సీ అమ‌లును మే వ‌ర‌కూ నిలిపేసిన వాట్సాప్.. తాజాగా త‌న స్టేట‌స్‌ను అప్‌డేట్ చేసింది. 

స్టేట‌స్‌లోనూ అదే గోల‌

యూజ‌ర్ల‌కు స్టేట‌స్‌లు చూసే అల‌వాటు బాగానే ఉంద‌ని గ్ర‌హించిన ఆ సంస్థ‌.. ఆ స్టేట‌స్ ద్వారానే త‌న గోడు వెల్ల‌బోసుకునే ప్ర‌య‌త్నం చేసింది. మీ ప్రైవ‌సీకి క‌ట్టుబ‌డి ఉన్నాం.. మీ కాంటాక్ట్‌ల‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోము.. మీ ప్రైవేట్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కాబ‌ట్టి వాటిని మేము చూసే, వినే అవకాశం లేదు.. మీరు షేర్ చేసిన లొకేష‌న్‌ను కూడా మేము చూడ‌ము అని స్ప‌ష్టం చేసింది. త‌మ డేటాకు భ‌ద్ర‌త లేద‌ని తెలిసిన చాలా మంది యూజ‌ర్లు ఇప్ప‌టికే వాట్సాప్‌ను వీడి టెలిగ్రామ్‌, సిగ్న‌ల్‌లాంటి ప్ర‌త్యామ్నాయాల వైపు వెళ్తుండ‌టంతో వాట్సాప్ ఇలా అన్ని విధాలుగా న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగుతోంది. 

VIDEOS

తాజావార్తలు


logo