గురువారం 03 డిసెంబర్ 2020
Science-technology - Nov 19, 2020 , 19:25:45

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌

హైద‌రాబాద్‌: ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ కొత్త ఫీచ‌ర్‌ను లాంచ్ చేయ‌బోతోంది. యూజ‌ర్లు త‌మ వీడియోల‌ను ఫ్రెండ్స్‌కు పంపించే ముందు మ్యూట్ చేసుకునే అవ‌కాశం ఈ కొత్త ఫీచ‌ర్ ద్వారా అందుబాటులోకి రానున్న‌ట్లు వాట్సాప్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo తెలిపింది. ప్ర‌స్తుతానికి బీటా వెర్ష‌న్‌లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఈ తాజా వెర్ష‌న్ 2.20.207.2 అప్‌డేట్‌తో యూజ‌ర్ల‌కు అడ్వాన్స్‌డ్ వాల్‌పేప‌ర్ ఫీచ‌ర్ల‌తోపాటు డిస‌ప్పియ‌రింగ్ మెసేజెస్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. మ‌రింత మంది యూజ‌ర్ల‌కు ఈ అడ్వాన్స్‌డ్ వాల్‌పేప‌ర్ ఫీచ‌ర్ల‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. 

ఈ ఫీచ‌ర్‌తో ఒక్కో చాట్‌కు ఒక్కో వాల్‌పేప‌ర్ సెట్ చేసుకునే అవ‌కాశం యూజ‌ర్‌కు క‌లుగుతుంది. ఈ నెల ప్రారంభంలోనే డిస‌ప్పియ‌రింగ్ మెసేజెస్ ఫీచ‌ర్‌ను వాట్సాప్ తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫీచ‌ర్‌తో ఒక చాట్‌కు పంపించిన కొత్త మెసేజ్‌లు ఏడు రోజుల త‌ర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. వ‌న్ ఆన్ వ‌న్ చాట్‌లో ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఈ ఫీచ‌ర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. గ్రూప్స్ విష‌యానికి వ‌స్తే అడ్మిన్‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌పై నియంత్ర‌ణ ఉంటుంది.