శనివారం 05 డిసెంబర్ 2020
Science-technology - Oct 23, 2020 , 16:17:06

వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఇదే..!

వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఇదే..!

హైదరాబాద్‌: మనం చాలా వాట్సాప్‌ గ్రూప్‌లలో ఉంటాం.. ఒక్కోసారి గ్రూప్‌చాట్‌ నోటిషికేషన్లు మనకు చాలా ఇబ్బందిగా మారుతాయి. మరి గ్రూప్‌లో కొనసాగుతూ గ్రూప్‌చాట్‌ను ఎప్పటికీ మ్యూట్‌ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా..! అలాంటి వారికోసమే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ‘ఆల్‌వేస్‌ మ్యూట్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీన్ని సెలెక్ట్‌ చేసుకుంటే ఇక గ్రూప్‌లో ఉన్నా చాట్‌ నోటిఫికేషన్లు మ్యూట్‌ అవుతాయి. మనకు ఇబ్బంది కలుగదు. 

ఇంతకుమందు 8 గంటలు, వారం, ఒక ఏడాది మాత్రమే మ్యూట్‌ చేసుకునే ఆప్షన్‌ ఉండేది. ఇప్పుడు వాటికి తోడు ఆల్‌వేస్‌ మ్యూట్‌ ఆప్షన్‌కూడా వచ్చి చేరింది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు, వెబ్ వెర్షన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్లతోపాటు వాట్సాప్ వెబ్‌లోనూ ఈ ఆప్షన్ ను వినియోగించుకోవచ్చు. మొదట బీటా వెర్షన్‌లో వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీరు వాట్సాప్ యూజర్లు ఐతే యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫీచర్ అందుబాటులో లేకపోతే మాత్రం యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.