బుధవారం 03 జూన్ 2020
Science-technology - Apr 07, 2020 , 16:54:21

ఫేక్‌ న్యూస్‌కు చెక్..ఫార్వర్డ్‌ మెసేజ్‌లపై ఆంక్షలు

ఫేక్‌ న్యూస్‌కు చెక్..ఫార్వర్డ్‌  మెసేజ్‌లపై ఆంక్షలు

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.  వాట్సాప్‌ వేదికగా నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిని కట్టడి చేయటానికి ఆ మెసేజింగ్ యాప్ పలు కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఐదుసార్లు ఫార్వార్డ్ చేసిన సందేశాలను..తరచుగా ఫార్వార్డ్‌ చేస్తున్న మెసేజ్‌లుగా వాట్సాప్‌  పేర్కొంటున్నది.  ఇకపై తరచుగా షేర్‌ అవుతున్న మెసేజ్‌ను ఒకసారి ఒక చాట్‌కు మాత్రమే ఫార్వార్డ్‌ చేసేలా వాట్సాప్‌ ఆంక్షలు విధించింది. ఇకపై వినియోగదారులు తమ గ్రూపుల్లో గాని, ఒకేసారి ఎక్కువ మందికి సందేశాలు లేదా వీడియోలను షేర్‌ చేయలేరు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో  నకిలీ వైద్య సలహా వార్తలు ఎక్కువగా వాట్సాప్‌లో వైరల్‌ కావడంతో వాట్సాప్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.  తాజా నిర్ణయంతో  ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో షేర్ చేయబడిన మెసేజ్‌లను ఒక చాట్‌కు మాత్రమే ఫార్వార్డ్  చేయగలం.  గతంలో  ఫేక్‌న్యూస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఒకేసారి ఐదుసార్లకు మించి ఫార్వార్డ్ చేయకుండా పరిమితి విధించిన విషయం తెలిసిందే. 


logo