వైఫై పేరు ఎప్పుడైనా విన్నారా.. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి వైఫై పేరు సుపరిచితమే. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. వైఫై నెట్వర్క్ ఉపయోగించి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకోవచ్చు. చాలామంది ప్రస్తుతం తమ స్మార్ట్ఫోన్లకు కానీ..పీసీలకు కానీ.. వైఫై నెట్‌వర్క్‌తోనే ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకుంటున్నారు. అయితే.. ఒక వైఫై నెట్‌వర్క్‌కు ఎక్కువమంది యూజర్లు లాగిన్ అయినప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. అలాగే.. నెట్వర్క్ రద్దీ పెరిగి.. సడెన్‌గా నెట్ ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వచ్చిన సరికొత్త టెక్నాలజీయే వైఫై 6ఈ. వైఫై స్టాండర్డ్నే వైఫై 6ఈ అంటారు.
2022 వరకు వైఫై 6ఈ స్టాండర్డ్నే మెయిన్‌స్ట్రీమ్‌గా తీసుకురానున్నారు. యాపిల్ లాంటి స్మార్ట్ఫోన్ల బ్రాండ్స్ అన్నింటిలోనూ వైఫై 6ఈ టెక్నాలజీని తీసుకురానున్నారు. అలాగే.. రూటర్ ఓఈఎమ్స్లోనూ ఇదే టెక్నాలజీని వాడనున్నారు.
వైఫై 6ఈ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ విపరీతంగా పెరుగుతుంది. క్షణాల్లో మూవీని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎంతమంది వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినా కూడా పెద్దగా నెట్వర్క్ సమస్యలు రావు.. ఇంటర్నెట్ స్పీడ్ తగ్గదు. వైఫై 6ఈ టెక్నాలజీ.. 6జీహెచ్ నెట్‌వర్క్స్‌ను సపోర్ట్ చేసే డివైజ్‌లలోనే ఈ వర్క్ అవుతుంది. ఆయా డివైజ్‌లు వైఫై 6 ప్రోటోకాల్‌కు అనుసంధానంగా పనిచేస్తే… అప్పుడు వైఫై 6ఈ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వొచ్చు.
సాధారణంగా వైఫై నెట్వర్క్స్ 2.4 జీహెచ్‌జెడ్, 5జీహెచ్‌జెడ్ బ్యాండ్లను కలిగి ఉంటాయి. 5జీహెచ్‌జెడ్ బ్యాండ్ అంటేనే ఇంటర్నెట్ విపరీతంగా స్పీడ్‌గా వస్తుంది. కానీ.. తాజాగా వైఫై 6ఈలో బ్యాండ్ 6జీహెచ్‌జెడ్ ఉంటుంది. దాన్నే స్పెక్ట్రమ్ అంటారు. వైఫై 6 టెక్నాలజీతో.. 6జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌తో వచ్చేదే ఈ వైఫై6ఈ స్టాండర్డ్.
2022 వరకు ఐఓఎస్, ఆండ్రాయిడ్.. రెండు ఓఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో వైఫై 6ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. వైఫై 6ఈ నెట్‌వర్క్‌ను తీసుకోవాలంటే.. 6ఈ ఫీచర్‌ను సపోర్ట్ చేసే రూటర్‌ను తీసుకొని.. 6జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రాండ్ బాండ్ సర్వీసులు అందించే.. పలు నెట్వర్క్స్ జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, యాక్ట్ కూడా ఇదే టెక్నాలజీని వాడనున్నాయి.
వైఫై సర్టిఫైడ్ 6.. వరల్డ్ వైడ్ వైఫై 6ఈ ఇంటరోపారబిలిటీ.. అనే ఫీచర్ ఉన్న ఫోన్లో మాత్రమే ఈ టెక్నాలజీ వర్క్ అవుతుంది.