గురువారం 29 అక్టోబర్ 2020
Science-technology - Sep 28, 2020 , 15:10:39

ముద్దుగా ఉన్న జంతువులను చూస్తే ఒత్తిడి హుష్‌కాకి!

ముద్దుగా ఉన్న జంతువులను చూస్తే ఒత్తిడి హుష్‌కాకి!

కాన్‌బెర్రా: చాలామంది కుక్కలు, పిల్లులు, ఇతరత్రా జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. ఇటీవల పెంపుడు జంతువుల ముద్దుచేష్టలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చాలామంది వీక్షిస్తుంటారు. అయితే, వీటివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే అవుననే అంటోంది ఓ కొత్త అధ్యయనం. ఈ ముద్దుముద్దు జంతువుల చిత్రాలు, వీడియోలు చూస్తే మాససిక ఒత్తిడిస్థాయిలు 50 శాతం తగ్గిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.  

ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌, టూరిజం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించారు. 19 మందిపై అధ్యయనం జరిపారు. ఇందులో పరీక్షకు హాజరుకాబోయే విద్యార్థులతోపాటు విద్యాసహాయక సిబ్బంది ఉన్నారు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో కనిపించే కోక్కాస్ అనే జంతువు వీడియోలను 30 నిమిషాలు చూపించారు. దీనికి ప్రపంచంలో సంతోషకరమైన జంతువుగా పేరుంది. అనంతరం వారిని పరీక్షించగా వారిలో ఒత్తిడిస్థాయి దాదాపు 50 శాతం తగ్గినట్లు గుర్తించారు. అధిక రక్తపోటు ఉన్నకొందరిలో అది ఆరోగ్యకరమైన రీడింగులకు పడిపోయినట్లు కనుగొన్నారు. సగటు సమూహ రక్తపోటు 136/88 నుంచి 115/71 కు పడిపోయిందని ఫలితాలు వెల్లడించాయి. అలాగే, ఇందులో పాల్గొన్న ఒకరి హృదయ స్పందన రేటు 90బీపీఎం నుంచి 68 బీపీఎంకు పడిపోయింది. సమూహంలోని ఆందోళన స్థాయిలు సగటున 35 శాతం,  కొంతమందిలో 50 శాతం తగ్గాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు అందమైన జంతువుల వీడియోలు చూడాలని తమ అధ్యయనం సూచిస్తున్నదని  ఇందులో పాల్గొన్న పరిశోధకురాలు డాక్టర్ ఆండ్రియా ఉట్లే పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.