ఆదివారం 07 జూన్ 2020
Science-technology - Apr 03, 2020 , 17:04:58

వొడాఫోన్‌ నుంచి మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు!

వొడాఫోన్‌ నుంచి  మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు!

హైదరాబాద్‌:  'వాల్యూ యాడెడ్‌ సర్వీసెస్‌' విభాగంలో   వొడాఫోన్‌ మూడు కొత్త ప్లాన్లను ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.47, రూ.67, రూ.78  ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌లతో  కాలర్‌ ట్యూన్‌, సర్వీస్‌ వ్యాలిడిటీ ప్రయోజనాలను అందించనుంది.  ఈ మూడు ప్లాన్లు ఆల్‌రౌండర్‌ ప్యాక్‌లలో భాగం కాదు. ఈ స్పెషల్‌ రీఛార్జ్‌తో ఎలాంటి డేటా లేదా టాక్‌ టైం ప్రయోజనం వినియోగదారులకు లభించదు.   రూ.67 రీఛార్జ్‌తో 90రోజులు, రూ.47 రీఛార్జ్‌తో 28 రోజులు, 78 ప్యాక్‌తో 89 రోజుల  పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ  ప్లాన్లు కొన్ని ప్రధాన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.


logo