బుధవారం 12 ఆగస్టు 2020
Science-technology - Jul 03, 2020 , 15:26:26

వివో Y30 స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ఫీచర్లు ఇవే!

వివో Y30  స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ఫీచర్లు  ఇవే!

న్యూఢిల్లీ   చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో తన వై సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో Y30ని  ఇవాళ భారత్‌లో లాంచ్‌ చేసింది.  వై30 ఫోన్‌ను వివో ముందుగా మలేషియాలో విడుదల చేసింది.  నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఫోన్లు విక్రయించనున్నారు. వివో వై30లో  క్వాడ్‌ కెమెరా, హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే డిజైన్‌, వెనుకవైపు ఫింగర్‌ ప్రింగ్‌ స్కానర్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.  4జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,990గా నిర్ణయించారు  స్మార్ట్‌ఫోన్‌ డాజిల్ బ్లూ,  ఎమరాల్డ్‌ బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నది.  

వై30 స్పెసిఫికేషన్లు..

డిస్‌ప్లే:6.47అంగుళాలు

ప్రాసెసర్‌: మీడియాటెక్‌ హీలియో పీ35

ఫ్రంట్‌ కెమెరా: 8 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 13+8+2+2 మెగా పిక్సల్‌

ర్యామ్‌:8జీబీ

స్టోరేజ్‌:128జీబీ

బ్యాటరీ:5000mAh

ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 10logo