బుధవారం 27 జనవరి 2021
Science-technology - Nov 27, 2020 , 16:45:03

లేటెస్ట్ ఫీచర్స్ తో విపణిలోకి వివో వై1ఎస్...

లేటెస్ట్ ఫీచర్స్ తో విపణిలోకి వివో వై1ఎస్...

బెంగళూరు :ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశ పెట్టింది. ఎంట్రీ లెవల్ వినియోగదారుల కోసం "వివో వై1ఎస్" పేరుతో కొత్తమొబైల్ ని తీసుకొచ్చింది. ఈ సారి తన వెబ్‌సైట్‌ ద్వారా ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఇవిగో ఫీచర్స్... 

 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడి ఫ్లాష్ ఉన్న13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 10.5పై నడుస్తుంది. రివర్స్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. అరోరా బ్లూ, ఆలివ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.

డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ 2.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. కానీ దీని ధరను అధికారికంగా ప్రకటించలేదు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 4030 ఎంఏహెచ్ బ్యాటరీలను ఇందులో అందించారు.

వివో వై1ఎస్ లో 6.22 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 720 x 1520గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88.6 శాతంగా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ35 ఎంటీ6765 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనున్నది.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo