ఆదివారం 09 ఆగస్టు 2020
Science-technology - Jul 16, 2020 , 16:04:13

వివో ఎక్స్‌50, ఎక్స్‌50 ప్రొ స్మార్ట్‌ఫోన్లు విడుదల

 వివో ఎక్స్‌50,   ఎక్స్‌50 ప్రొ స్మార్ట్‌ఫోన్లు విడుదల

ముంబై:  ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌   బ్రాండ్ వివో  ఎక్స్50 సిరీస్‌లో  ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు  వివో X50, X50 ప్రొలను ఇవాళ భారత్‌లో లాంచ్‌ చేసింది. రెండు మోడళ్లలో హోల్‌-పంచ్‌ డిస్‌ప్లే, 3డీ సౌండ్‌ ట్రాకింగ్‌, ఆడియో జూమ్‌, సూపర్‌నైట్‌ మోడ్‌3.0, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

భారత్‌లో వివో ఎక్స్‌50.. 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌   ధరను రూ.34,990గా నిర్ణయించారు. 256జీబీ వేరియంట్‌ ధర  రూ. 37,990గా ఉన్నది. వివో ఎక్స్‌ 50 ప్రొ ఫోన్‌లో 256జీబీ వేరియంట్‌ ధర రూ.49,990గా ఉంది.  వివో ఎక్స్‌50 ఫోన్‌ ఫ్రాస్ట్‌ బ్లూ, గ్లేజ్‌ బ్లాక్‌ కలర్లలో అందుబాటులో ఉండగా..ఎక్స్‌ 50 ప్రొ ఆల్ఫా గ్రే కలర్‌లో మాత్రమే వస్తున్నది. 

 రెండు కొత్త ఫోన్లను జూలై 24 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో  ఇవాళ్టి నుంచే   ప్రీ-బుకింగ్‌ ప్రారంభమైంది. రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, విజయ్‌ సేల్స్‌, పేటీఎం మాల్‌, టాటాక్లిక్‌ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు.  


logo