Vivo V21e 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలో అద్భుత ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. వివో వీ21ఈ(V21e) 5జీ మోడల్‌ను జూన్ 24న సాయంత్రం 5గంటలకు భారత్‌లో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రిలీజ్‌కు సంబంధించి మైక్రోసైట్‌ను ఏర్పాటు చేసింది.
రాబోయే వివో ఫోన్లో 8జీబీ ర్యామ్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వాటర్ డ్రాప్ నాచ్ 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కొత్త ఫోన్ అద్భుత ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వీ-21 5జీ మోడల్ కన్నా వీ-21ఈ 5జీ మోడల్ ధర తక్కువగా ఉండనున్నట్లు తెలిసింది. వీ21 5జీ మోడల్ ధర రూ.29,990కాగా భారత్‌లో వీ21ఈ 5జీ వేరియంట్ ధర రూ.24,990గా ఉండనుంది. తాజాగా వివో వీ21ఈ ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.
వివో వీ21ఈ 5జీ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.44 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 64+8 మెగా పిక్సెల్
ర్యామ్:8జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4000ఎంఏహెచ్
ఓఎస్:ఆండ్రాయిడ్ 11