చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ వివో సరికొత్త 5G ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. వివో V21 5G స్మార్ట్ఫోన్ను ఏప్రిల్ 29న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 44MP నైట్ సెల్ఫీ కెమెరా ఫోన్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సన్సెట్ డాజిల్, ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ కలర్లలో విడుదల కానుంది. ట్రిపుల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ప్లే, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్తో కూడిన 44 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్లను ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. భారత్లో వివో వీ20 మోడల్ ధర 22,990గా నిర్ణయించారు. ఐతే కొత్తగా రిలీజ్ అయ్యే వీ21 5జీ ఫోన్ ధర కాస్త ఎక్కువగానే ఉండనుంది.