శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 18, 2021 , 21:57:38

భవిష్యత్ అంతా బిగ్ డేటాదే

భవిష్యత్ అంతా బిగ్ డేటాదే

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుత ఆధునిక ప్ర‌పంచంలో బిగ్ డేటా, కృత్రిమ మేధస్సు వంటి నైపుణ్యాల‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌చ్చేనెల ఒక‌టో తేదీన 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్‌లో డేటా ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, కృత్రిమ మేధసు నైపుణ్యం పెంచ‌డానికి ఉదారంగా నిధులు కేటాయించ‌నున్నార‌ని తెలుస్తున్న‌ది. ఈ రంగాల్లో రీసెర్చ్‌, క‌మ‌ర్షియ‌ల్ డేటా సెంట‌ర్ల పురోభివ్రుద్ధికి చేర్య‌లు చేప‌ట్ట‌నున్నారు. 

బిగ్ డేటా రూపంలో సంపద స్రుష్టి ఇలా

బిగ్ డేటా రూపంలో డేటా సైన్స్ నూత‌న సంప‌ద స్రుష్టి మార్గంగా క‌నిపిస్తున్న‌ది. ఇంట‌ర్నెట్ ఆఫ్ థింక్స్  (ఐవోటీ) లేదా ఇంట‌ర్‌క‌నెక్టెడ్ ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంతో ప్ర‌జ‌లు భారీ మొత్తంలో స‌మాచారాన్ని స్రుష్టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ రంగంలో భ‌‌విష్య‌త్ ధోర‌ణుల‌ను విశ్లేషించ‌డానికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే డిజిట‌ల్ ఇంటెలిజెన్స్‌లో మాన‌వ వ‌న‌రుల నాణ్య‌త‌పైనే డేటా ఆధారిత ఆర్థిక ప్ర‌పంచానికి ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి.

భారీగా ఇన్ ఫ్రా డెవలప్ చేయాలి

భారీమొత్తంలో మొబైల్ ఫోన్లతో అత్య‌ధిక ఇంట‌ర్నెట్ వాడ‌కం జ‌రుగుతున్న నేప‌థ్యంలో భార‌త్‌లో డేటా ఇన్‌ఫ్రాక్ట్ర‌క్చ‌ర్ అభివ్రుద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఆరోగ్య‌, విద్యారంగాల్లో మ‌రింత మెరుగు ప‌డాల్సి ఉంది. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తి త‌క్కువ‌గా ఉండ‌గా, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరు పేల‌వంగా ఉంది. ఈ తరుణంలో బిగ్ డేటా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వ్య‌వ‌సాయం, ఆరోగ్యం, విద్యారంగాల్లో విస్త‌రించ‌డానికి వెసులుబాటుగా ఉంటుంది. కానీ దేశంలో డేటా మౌలిక వ‌స‌తులు ప్ర‌స్తుతం మ‌న దేశీయ అవ‌స‌రాల‌కు స‌రిప‌డినంత‌గా లేవన్న విమ‌ర్శ ఉంది. 

బిగ్ డేటాతో దుబారా కంట్రోల్ ఈజీ 

ఇదిలా ఉంటే, స్థానికంగా, జాతీయంగా  మొబిలిటీ, సామాజిక ఆర్థిక రంగాల సంప్ర‌దింపులు, వినియోగం ప్ర‌భావంపై మొబైల్ నెట్‌వ‌ర్క్‌స్ డేటా విలువైన స‌మాచారాన్ని అందిస్తుంది. బిగ్ డేటా వినియోగంతో వ్య‌యం త‌గ్గింపుతోపాటు విధాన నిర్ణ‌యాల్లో జోక్యం ద్వారా దుబారాను అరిక‌ట్ట‌డానికి వెసులుబాటు ల‌భిస్తుంది. 

వ్యాక్సినేషన్ ప్రక్రియలో బిగ్ డేటా

ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుత కొవిడ్‌-19 వ్యాక్సినేష‌న్  వ్యూహం అమ‌లుకు బిగ్ డేటా అన‌లిటిక్స్‌ను వినియోగిస్తున్నారు. త‌ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధ‌న దిశ‌గా ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ది. డ‌యాగ్న‌స్టిక్స్‌, చికిత్సా ఖ‌ర్చును త‌గ్గించ‌డంలో చాలా స‌మ‌ర్థ‌వంతంగా బిగ్ డేటా ఉప‌క‌రిస్తున్న‌ది. డేటా ఆధారంగా స‌రైన స‌మ‌యంలో వైద్యులు చికిత్స అందించేందుకు వీలు క‌లుగుతుంది. బిగ్ డేటాతోపాటు ఆర్థిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో స‌కాలంలో వైద్యుల జోక్యంతో వ్యాధులను నిర్ధారించొచ్చు. బిగ్ డేటా అన‌లిటిక్స్‌తో పాఠ‌శాల‌ల్లో టీచ‌ర్ల ప‌నితీరును అంచ‌నా వేయ‌డంతోపాటు విద్యార్థుల డ్రాప‌వుట్ల‌కు కార‌ణాలు తెలుసుకునే వీలుంది. ఉప‌గ్ర‌హ చిత్రాల సాయంతో భూముల్లో పంట‌లు దెబ్బ తిన‌డానికి కార‌ణాల‌ను అంచ‌నా వేయ‌డానికి వెసులుబాటు ఉంది. బిగ్ డేటా వ‌న‌రు కంటే దాని స‌మాచార విలువ అమూల్యం. 

స్కిల్ పై శిక్షణకు ఇలా సమయాత్తం

తొలి రెండు పారిశ్రామిక విప్ల‌వాల నుంచి భార‌త్ ల‌బ్ధి పొంద‌లేక‌పోయింది. మూడో పారిశ్రామిక విప్ల‌వం మిస్ అయింది. కానీ త‌దుప‌రి వ‌చ్చే పారిశ్రామిక విప్ల‌వానికి సార‌ధ్యం వ‌హించాల‌ని భార‌త్ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ది. త‌దుప‌రి పారిశ్రామిక విప్ల‌వానికి  డేటా సైన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంధాన‌క‌ర్త‌లుగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో డేటా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తోపాటు బిగ్ డేటా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకించి యువ‌త‌రానికి శిక్ష‌ణిచ్చేందుకు కేంద్రం నిధులు వ‌చ్చే బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌నున్న‌ద‌ని తెలుస్తున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo