VI Network Problems : ప్రస్తుతం మెబైల్ నెట్వర్క్ రంగంలో ఆపరేటర్ కంపనీల మద్య పోటీ చాలా తీవ్రంగానే ఉంది. ఈ తరుణంలో నెట్వర్క్ ప్రొవైడర్లు తమ వినియోగదారులను కాపాడుకునేందుకు, కొత్త వినియోగదారులను పొందేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నాయని వార్తలు వింటూనే ఉన్నాం.
మార్కెట్లోకి జియో సంస్థ ప్రవేశించినప్పటి నుంచి అప్పటివరకు వినియోగదారులకు భారీ రేట్లకు తక్కువ డేటా, కాలింగ్ సధుపాయాలను అందించిన నెట్వర్క్ కంపనీలు కూడా తమ ప్యాక్‌లను పోటీదారునికి పోటీగా మార్పులు చేస్తూ మేమూ పోటీలో ఉన్నామంటూ కటింగ్ ఇస్తూ వస్తున్నాయి.
ఇక మరి కొన్ని కంపనీలు తమ వినియోగదారులకు తాము తప్ప ఇంకెవ్వరూ అత్యుత్తమ సేవలను అందించలేరంటూ ప్రచారం చేస్తున్నాయి. అయితే నిజానికి ఈ ప్రకటనలన్నీ కేవలం ప్రకటనల వరకే నిమిత్తం అవుతున్నాయి.
సేవల్లో మాత్రం ఈ కంపనీలు తమ ప్రకటనలకు ఎక్కడా తూగటం లేదు. ప్రస్తుతం దేశంలో ఉత్తమ నెట్వర్కుగా తమను తాము చెప్పకుంటున్న వీఐ, ఎయిర్టెల్ కంపనీలు వినియోగదారులకు అందించే సేవలు చాలా దారుణంగా ఉన్నాయని వినియోగదారులు ఈ కంపనీలను తిట్టిపోస్తున్నారు.
వినియోగదారులు ప్రకటనలను చూసి పొరపాటున వీఐ, ఎయిర్టెల్ వంటి నెట్‌వర్క్‌లలోకి మారుతున్నారు. ఇలా మారిన వినియోగదారులు మూడు నెలల వరకు ఇతర నెట్‌వర్క్‌లోకి మారేందుకు వీలు లేదు. దీంతో చచ్చినట్లు మూడు నెలలు అదే నెట్‌వర్క్‌లో ఉండాల్సి వస్తుంది.
ఇక ఓ కన్నింగ్ ప్లాన్‌తో వినియోగదారునితో రిచార్జి చేయించేందుకు ఈ సంస్థలు మెదటి రీచార్జ్‌ను రెండు నెలలు ఉండేలా పోర్ట్ ఇన్ అయిన వినియోగదారులకు ఇస్తున్నాయి. దీంతో వినియోగదారుడు మళ్ళీ రీచార్జ్ చేసుకుంటున్నాడు. ఇక ఈ మూడు నెలలు అయ్యేసరికి వినియోగదారునికి విసుగొచ్చి బీపీ తెచ్చుకోవడమే మిగులుతుంది.
వీఐ నెట్‌వర్క్‌లో ప్రతి 5 నుంచి 10 సెకన్లకు ఒకసారి అలెర్ట్‌లు వస్తాయి. అందులో ఏదో పనికిరాని ప్యాక్ యాక్టివేట్ చేసుకుని డబ్బులు తగలేసుకోండి అనే మెసేజ్ వస్తుంది. దాన్ని వినియోగదారుడు పొరపాటుగా క్లిక్ చేసి యాక్టివ్ చేసుకునేలా ట్రిక్ ప్లే చేస్తుంది వీఐ. ఇందులో ఓ వైపు ఆ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు, మరోవైపు రద్దు చేసుకునేందుకు ఆప్షన్ వస్తుంది. ఆ ఆఫ్షన్ ఎప్పుడు ఏ వైపు ఉంటుందని చెప్పలేం.
దీంతో మంచి పనిలో ఉన్నప్పుడు వినియోగదారుడు ఈ ఆఫ్షన్లలో పొరపాటుగా ఆ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటాడు. దీంతో వినియోగదారునికి డబ్బులు వృధా. ఇక వీఐలో అనేక ప్రాంతాల్లో ఉన్న మెజీరిటీ వినియోగదారులకు ఉన్న సమస్య మరొకటి ఉంది. సాదారణంగా వీఐలో నెట్వర్క్ బాగానే ఉన్నప్పుడు కూడా అవతలి వారు కాల్ చేసినపుడు వారికి వీఐ వినియోగదారుడు అందుబాటులో లేనట్లు సమాదానం వస్తుంది. దీంతో వీఐ వినియోగదారులు తమకు ముఖ్యమైన కాల్స్‌ను అందుకోలేకపోతున్నారు.
ఇక చివరగా ఇటువంటి సమస్యలు కస్టమర్ కేర్ ప్రతినిధులకు తెలిపేందుకు కాల్ చేస్తే ఆ కాల్ కనెక్ట్ అయ్యే సరికే చాలా సమయం పడుతుంది. ఆ నెంబర్ నొక్కండి, ఈ నెంబర్ నొక్కండి అంటూ ఏప్పుడో పుణ్యకాలం గడిచాక ఆ కాల్ కలుస్తుంది. ఇక కాల్ లిఫ్ట్ చేసిన ప్రతినిధి వినియోగదాలరులకు కావాల్సిన సమాచారం మాత్రం ఇవ్వకుండా, సమస్యను పరిష్కరించకుండా కంప్లైంట్ తీసుకుంటాం అని జారుకుంటాడు. ఇక గట్టిగా అడిగితే వినియోగదారులపైనే విసుక్కుంటారు కూడా.
దీంతో చిర్రెత్తుకొస్తున్న వినియోగదారులు ఇక వీఐ నెట్వర్క్ ఇలాగైతే కంపనీ మూసుకోవాల్సిందే అంటూ సోషల్‌మీడియాలో మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే వొడాఫోన్, ఐడియా కంపనీలు పోటీని తట్టుకోలేక మెర్జ్ అయి ఒకటిగా కలిసి వీఐగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం వారు ఇస్తున్న సర్వీసుతో తమంతట తామే తమ కంపనీని మూసుకునేందుకు సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు.
ముందు ముందు ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో భాగస్వామ్యం కాబోతున్న ఈ సంస్థ ఆ సంస్థ భవితవ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేయబోతుందా అనే అనుమానం రేకెత్తుతుంది.