శుక్రవారం 30 అక్టోబర్ 2020
Science-technology - Oct 17, 2020 , 20:33:27

విటమిన్‌ ‘డి’పై క్లినికల్‌ ట్రయల్స్‌

విటమిన్‌ ‘డి’పై క్లినికల్‌ ట్రయల్స్‌

లండన్‌: కొవిడ్‌-19కు చికిత్సగానీ, దాన్ని ఎదుర్కొనే టీకాగాని ఇంతదాకా లేదు. అయితే, విటమిన్‌ ‘సి’, విటమిన్‌ ‘డి’ రోగనిరోధక శక్తిని పెంచి కరోనాతో పోరాడేలా చేస్తాయని పలు అధ్యయనాలు సూచించాయి. కానీ దానిపై స్పష్టత లేదు. అందుకే పూర్తిస్థాయి అవగాహన కోసం బ్రిటన్‌ శాస్త్రవేత్తలు విటమిన్‌ ‘డి’పై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.  

ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగల వలంటీర్ల కోసం శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. విటమిన్‌ ‘డి’ లోపం ఉన్నవారిని ఇందుకు ఎంచుకుంటారు. వారికి విటమిన్‌ సప్లిమెంట్స్‌ను పెద్ద మోతాదులో ఇస్తారు. వారిలో కరోనా అడ్డుకునే ప్రతిరోధకాలు అభివృద్ధి చెందితే విటమిన్‌ ‘డి’ని చికిత్సలో విస్తృతంగా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ట్రయల్స్‌కు లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు నాయకత్వం వహిస్తున్నారు. బార్ట్స్ ఛారిటీ నిధులు సమకూరుస్తున్నది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.