బుధవారం 12 ఆగస్టు 2020
Science-technology - Jul 16, 2020 , 18:15:14

యూఏఈ మార్స్ మిషన్ ప్రయోగం వాయిదా

యూఏఈ మార్స్ మిషన్ ప్రయోగం వాయిదా

టోక్యో :  అననుకూల వాతావరణం కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మార్స్ మిషన్ గురువారం మూడవసారి వాయిదా పడింది. తిరిగి ఈ నెలాఖరులోగా దీనిని ప్రారంభించనున్నట్లు యూఏఈ మిషన్ బృందం పేర్కొన్నది. యూఏఈ మొదటి మార్స్ మిషన్ పేరు 'హోప్'. దీనిని జపాన్‌కు చెందిన తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెచ్ -2 ఐఐఐ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. తొలి ప్రయోగానికి బుధవారం నిర్ణయించారు. రెండో ప్రయోగం గురువారం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఈ వారంలో జపాన్‌ లో భారీగా వర్షాలు కురిశాయి. ఈ కారణంగా క్యుషు ద్వీపంలో చాలా చోట్ల వరదలు సంభవించాయి. అటువంటి పరిస్థితిలో ప్రయోగించడం సాధ్యం కాదని ప్రయోగాన్ని వాయిదా వేశారు. 2021 ఫిబ్రవరిలో దీని ఆర్బిటర్ అంగారక గ్రహానికి చేరుకుంటుందని భావిస్తున్నారు

ఈ మిషన్ యూఏఈకి అతి ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది. ఈ మార్స్ మిషన్ కనీసం రెండు సంవత్సరాలు అంగారక కక్ష్యలో కక్ష్యలో తిరుగుతుంది. అంగారక గ్రహం యొక్క ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేసే, వాతావరణ మార్పుల గురించి సమాచారాన్ని సేకరించే మూడు సాధనాలను కలిగి ఉన్నది. వివిధ వాతావరణాలలో అంగారక వాతావరణం యొక్క పూర్తి చిత్రాన్ని మొదటిసారిగా వెల్లడిస్తామని యూఏఈ తెలిపింది.

యూఏఈ అంతరిక్ష మిషన్ నిర్వహణ మొత్తం మహిళా శాస్త్రవేత్త సారా అల్ అమిరి నాయకత్వంలో జరుగుతంది. సారా గతంలో దుబాయ్ అంతరిక్ష కేంద్రంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆమె షార్జా అమెరికన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పొందారు.


logo