మంగళవారం 31 మార్చి 2020
Science-technology - Mar 18, 2020 , 23:17:39

నూతన శ్రేణి వాహనాలను ఆవిష్కరించిన ‘టీవీఎస్‌’

నూతన శ్రేణి వాహనాలను ఆవిష్కరించిన ‘టీవీఎస్‌’

హైదరాబాద్‌: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మార్కెట్‌లోకి నూతన శ్రేణి వాహనాలను రాష్ట్రంలో ఆవిష్కరించింది. 2020 టీవీఎస్‌ ఎక్సెల్‌ 100, బీఎస్‌ -వీఐ పేర్లతో విపణిలోకి ప్రవేశపెట్టింది. ఎకో థ్రస్ట్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌(ఈటీఎఫ్‌ఐ) టెక్నాలజీతో వీటిని రూపొందించారు. (ఈటీఎఫ్‌ఐ) టెక్నాలజీతో 15 శాతం అదనంగా మైలేజీ వస్తుంది. ఇంజిన్‌ ఫ్యూయల్‌ సిస్టమ్‌ ఫంక్షన్స్‌ను ఎలక్ట్రానిక్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఎటువంటి శబ్దం లేకుండా ఇంటిగ్రేటెడ్‌ స్టార్టర్‌ జనరేషన్‌(ఐఎస్‌జీ) సిస్టమ్‌ను అమర్చారు. ఎక్స్‌ షోరూమ్‌ ధరలు టీవీఎస్‌ ఎక్సెల్‌ 100 హెవీ డ్యూటీ ఐటచ్‌ స్టార్ట్‌: రూ.43,504, టీవీఎస్‌ ఎక్సెల్‌ 100 హెవీ డ్యూటీ ఐటచ్‌ స్టార్ట్‌ స్పెషల్‌ ఎడిషన్‌ : రూ. 44,744, టీవీఎస్‌ ఎక్సెల్‌ 100 కంఫర్ట్‌ ఐటచ్‌ స్టార్ట్‌: రూ. 45,074గా నిర్ణయించారు.


ఫీచర్లు 

* సులభమైన స్విచ్‌ ఆన్‌ -ఆఫ్‌ 

* భారీ ఫ్లోర్‌ బోర్డ్‌ ఏరియా, ఫ్యూయల్‌ రిజర్వ్‌ ఇండికేటర్‌ 

* అత్యధిక స్కార్క్‌ ఎనర్జీ ఇంజిన్‌ 

* 6000ఆర్‌పీఎమ్‌ వద్ద గరిష్ఠ శక్తి 3.2కెడబ్ల్యూ(4.3బీహెచ్‌పీ)

* 99.7 సీసీ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌ 

* 3500 ఆర్‌పీఎమ్‌ వద్ద గరిష్ఠంగా 6.5 ఎన్‌ఎమ్‌ టార్క్‌ 

* ఫ్యూయల్‌ రిజర్వ్‌ ఇండికేటర్‌ 

* మొబైల్‌ చార్జర్‌ logo
>>>>>>