ముంబై, జూన్ 15: టీవీఎస్ అపాచీ సరికొత్త ఆఫర్ ను అందిస్తున్నది. స్పోర్ట్స్ బైక్ అపాచీ ఆర్టీఆర్ 200 ను రూ.10,000 తగ్గింపుతో అందించేందుకు సిద్ధమైంది. ఆన్లైన్ బుకింగ్‌లో 5 శాతం వరకు ,గరిష్టంగా రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్‌ను టీవీఎస్ మోటార్స్ అందిస్తున్నది. అంతేకాదు ఫైనాన్స్స్కీమ్ కింద రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది. అపాచీ ఆర్టిఆర్ 200 బైక్‌లో 197.75 సిసి సామర్థ్యం గల బిఎస్ 6 కంప్లైంట్ ఆయిల్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది.
ఈ ఇంజిన్ 20.54bhp స్ట్రాంగ్ పవర్ ను17.25Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. సింగిల్ చానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) , డ్యూయల్ చానల్ ఎబిఎస్‌లతో వచ్చే ఈ బైక్ మొత్తం నాలుగు వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా స్ప్లిట్ టైమ్ సీట్లు, గ్రాబ్ రైల్ హ్యాండిల్ దాని సైడ్ ప్రొఫైల్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. దీనితో పాటు ఎల్ఈడీ లైట్లు, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇచ్చారు. మొబైల్ కనెక్టివిటీ, గ్లైడ్ త్రూ టెక్నాలజీ (జిటిటి) వంటి ఫీచర్లు ఉన్నాయి.